మోకోపి పేరుతో 6 మోషన్ ట్రాకింగ్ సెన్సర్లని లాంచ్ చేసిన సోనీ

మోకోపి పేరుతో 6 మోషన్ ట్రాకింగ్ సెన్సర్లని లాంచ్ చేసిన సోనీ

జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ సోనీ ‘మోకోపి’ పేరుతో 6 మోషన్ ట్రాకింగ్ సెన్సర్ బ్యాండ్లని లాంచ్ చేసింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌లకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి వాడుకోవచ్చని తెలిపింది. ఈ సెన్సర్స్ ఎలా పనిచేస్తాయంటే...

ఈ 6 సెన్సర్లని తల, మణికట్టు, నడుము, పాదాలకు పెట్టుకోవాలి. తర్వాత బ్లూ టూత్ సాయంతో మోకోపి యాప్‌కి కనెక్ట్ చేసుకొని వీటిని వాడుకోవచ్చు. ఈ సెన్సర్లతో శరీర మోషన్ ట్రాకింగ్ చేయొచ్చు. అంటే మీరు ఏం చేసినా దాన్ని ఈ సెన్సర్లు రికార్డ్ చేస్తాయి. రీకార్డ్ చేసినదాన్ని అవతార్ రూపంలో యానిమేట్ చేస్తాయి. ఆ యానిమేటెడ్ అవతార్‌ని స్క్రీన్‌లో చూసుకోవచ్చు. మెటావర్స్‌లో వినియోగించుకోవచ్చు. 2023 జనవరిలో ప్రీ-ఆర్డర్స్ తీసుకుంటారని చెప్తున్నారు. అయితే, భారత కరెన్సీలో వీటి ధర రూ. 29,000 ఉంది.