
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియన్ ఆర్మీ చేపట్టిన మిషన్ ఆపరేషన్ సిందూర్. 26 మంది అమాయక టూరిస్టులను పొట్టనపెట్టుకున్నందుకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. పార్ ఆర్మీ బేస్ లతో పాటు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది ఇండియా. ఇప్పుడు ఈ ఆపరేషన్ సిందూర్ ను పాఠ్యాంశంగా చేర్చేందుకు ఎన్సీఈఆర్టీ సన్నాహాలు చేస్తోంది.
NCERT బుక్స్ లో ఆపరేషన్ సిందూర్ ను లెసన్ గా తీసుకొస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి పరిణామాలతో పాటు.. ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి విద్యార్థులకు తెలిసేలా చేసేందుకు.. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ సాహసోపేతమైన ఆపరేషన్ గురించి ముందు తరాలకు తెలిసేలా 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సిలబస్ గా పెట్టనున్నారు.
అంతేకాకుండాMission LiFE, చంద్రయాన్, ఆదిత్యా L1, శుభాన్షు శుక్లా స్పేస్ మిషన్ మొదలైన అంశాలను పాఠ్యపుస్తకాలలో పొందుపర్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ నుంచి సమాచారం.
ఈ అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చేందుకు రెండు మాడ్యూల్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొదటిది 3-12 తరగతుల వరకు, రెండవ మాడ్యూల్ 9-12 తరగతుల వరకు. ప్రతి మాడ్యూల్ దాదాపుగా 8 నుంచి 10 పేజీల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇండియా మిలిటరీ, అంతరిక్ష ప్రయోగం తదితర అంశాలలో భారత జైత్రయాత్రలకు సంబంధించిన ముఖ్య విషయాలను ఇందులో పొందుపరిచారు.
విద్యార్థులు ఇండియన్ ఆర్మీ గురించి తెలుసుకునేందుకు.. అదే విధంగా శాస్త్ర సాంకేతిర రంగాలలో భారత్ చేస్తున్న కృషిని గురించి తెలుసుకుని.. ఇన్సైర్ అయ్యేందుకు ఈ అంశాలను పాఠ్యాంశాలుగా తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు.