అగ్ని ప్రమాదాల్లో జొన్న పంట దగ్ధం

అగ్ని ప్రమాదాల్లో జొన్న పంట దగ్ధం
  • కుభీర్ మండలంలోని మాలేగాం, సిర్పెల్లి(హెచ్)లో ఘటనలు

కుభీర్, వెలుగు: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ఒక్క రోజే రెండు అగ్ని ప్రమాదాలు జరిగి పంట కాలిపోయింది. చేతికి వచ్చిన పంట కండ్ల ముందే కాలి బూడిద కావడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మండలంలోని మాలేగాంలో పక్కపక్కనే ఉండే రైతు గౌతమ్, భోజరాం మొక్కజొన్న చేనుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని​ఐదెకరాల్లో పంట కాలి బూడిదైంది.

రూ.3 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు బోరున ఏడ్చారు. సిర్పెల్లి(హెచ్) లో రైతు దత్తురాం ఒకటిన్నర ఎకరాల్లో వేసిన మొక్కజొన్న సైతం కాలిపోయింది. రూ.1.50 లక్షల నష్టం జరిగిందని రైతు వాపోయాడు. వేలల్లో పెట్టుబడి పెట్టి అప్పుల్లో ఊరుకుపోయామని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కాలిపోయిన పంటలను రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. సుమారు రూ.4 లక్షల 50 వేల నష్టం వాటిల్లినట్లు నిర్ధారించారు. నివేదికలను ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు.