అసోచామ్‌‌‌‌ అధ్యక్షుడిగా సంజయ్‌‌‌‌ నాయర్‌‌‌‌ 

అసోచామ్‌‌‌‌ అధ్యక్షుడిగా సంజయ్‌‌‌‌ నాయర్‌‌‌‌ 

న్యూఢిల్లీ: సోరిన్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఫండ్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ సంజయ్‌‌‌‌ నాయర్‌‌‌‌ 2024-–25 సంవత్సరానికి అసోసియేటెడ్​ చాంబర్స్​ ఆఫ్​ కామర్స్​అండ్​ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్‌‌‌‌) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు పరిశ్రమల సంఘం మంగళవారం వెల్లడించింది. స్పైస్‌‌‌‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ ఛాంబర్ అధ్యక్షుడిగా పదవీకాలంలో ముగియడంతో నాయర్​ బాధ్యతలు తీసుకున్నారు

నాయర్ ​సిటీ గ్రూపులో 25 సంవత్సరాలు,  కేకేఆర్​లో దాదాపు 14 సంవత్సరాలు పనిచేశారు. గ్లోబల్ ఫైనాన్షియల్  క్యాపిటల్ మార్కెట్లలో నాలుగు దశాబ్దాలపాటు పనిచేశారు. తన భార్య ఫల్గుణి నాయర్ స్థాపించిన నైకాలో నాన్-–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌గా కూడా పనిచేస్తున్నారు.