సౌండ్ ఎక్కువైతే ఫైన్​ పడుద్ది

సౌండ్ ఎక్కువైతే ఫైన్​ పడుద్ది

సిటీ రోడ్లపైకి సౌండ్ పొల్యూషన్ చెకింగ్​మెషీన్లు వచ్చినయ్. సైబరాబాద్ ​కమిషన రేట్​ పరిధిలో పోలీసులు శుక్రవారం నుంచి స్పెషల్​ డ్రైవ్ ​చేస్తున్నరు. వెహికిల్ హారన్, సైలెన్సర్ల నుంచి పరిమితికి మించి సౌండ్​వస్తే వెయ్యి రూపాయల ఫైన్ ​వేస్తున్నరు. నిబంధనలకు విరుద్ధంగా హారన్​, సైలెన్సర్లు బిగిస్తే జరిమానా తప్పదంటున్నారు.

హైదరాబాద్, వెలుగుహైదరాబాద్.వెలుగు:

సిటీ రోడ్లపైకి సౌండ్ పొల్యూషన్ మెషీన్లు వచ్చాయి. వెహికల్ హారన్, సైలెన్సర్ నుంచి నిర్ణీత సౌండ్ కంటే ఎక్కువ వస్తే ట్రాఫిక్ పోలీసులు రూ.వెయ్యి ఫైన్ విధిస్తున్నారు. ‘సౌండ్ లెవల్ మీటర్’ పేరుతో పిలిచే ఈ డిజిటల్ డివైజ్ తో  హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి,మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అందుబాటులో ఉన్న రెండు సౌండ్ లెవల్ మీటర్ లతో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. రూల్స్ కి విరుద్ధంగా హారన్స్,సైలెన్సర్ లను ఏర్పాటు చేసుకునే వాహనదారులకు కూడా ఫైన్ విధిస్తున్నారు.

పెరుగుతున్న సౌండ్ పొల్యూషన్

కొత్త వెహికల్ నుంచి సాధారణంగా 90 నుంచి 100 డెసిబుల్స్ కంటే తక్కువ సౌండ్ వస్తుంది. ఇందులో బైక్స్ హారన్స్,సైలెన్సర్ ల నుంచి 90 డెసిబుల్స్ మాత్రమే సౌండ్ ఫిక్స్ చేసి ఉంటుంది. షోరూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది తమ వెహికల్ హారన్ ను ఎక్కువ సౌండ్ వచ్చేలా మార్చుకుంటారు. పెద్ద శబ్దాలు వచ్చేలా సైలెన్సర్లను బిగిస్తుంటారు. దీంతో రోడ్లపై  రోజురోజుకి సౌండ్ పొల్యూషన్ పెరిగిపోతోంది. దీంతో పాటు కార్లు,భారీ వెహికల్స్ కు సౌండ్ హారన్స్ 100 డెసిబుల్స్ గా ఫిక్స్ చేసి ఉంటాయి. కానీ ఖరీదైన  బైకులకు సైలెన్సర్,హారన్స్ ఆల్ట్రేషన్ చేసి రోడ్లపై న్యూసెన్స్ చేసే  విధంగా తయారు చేస్తున్నారు. ఇలాంటి వెహికల్స్ పై  సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

డివైజ్ ఇలా పనిచేస్తుంది

ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ లో వెహికల్ హారన్, సైలెన్సర్ వద్ద  సౌండ్ లెవల్ మీటర్ పెడతారు. 5 నుంచి10 సెకన్ల పాటు హారన్ లేదా సైలెన్సర్ సౌండ్ ను పరిశీలిస్తారు. ఒకవేళ హారన్ సౌండ్ లో రూల్స్ ప్రకారం బైక్స్ లో 90 , కారు,హెవీ వెహికల్స్ లో 100 డెసిబుల్స్ కి మించి సౌండ్ వస్తే ఆ వాహనదారునికి రూ.వెయ్యి  ఫైన్ విధిస్తున్నారు. దీంతో బైక్స్ సైలెన్సర్ ఆల్ట్రేషన్ చేసి భారీ శబ్ధాలు చేసే వారికి సౌండ్ లెవర్ మీటర్ చెక్ పెడుతుంది. సైలెన్సర్ లతో సౌండ్ పొల్యూషన్ చేసే వారిని గుర్తించి ఈ డివైజ్ ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇన్ స్పెక్టర్ రాములు,ఎస్సై రఘు శుక్రవారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 5 రెడిమిక్స్ లారీలు,2 ట్యాంకర్స్ పై కేసులు నమోదు చేశారు.