విజయ్‌ ఇంగ్లండ్‌ కు సరిపోతాడు: గంగూలీ

విజయ్‌ ఇంగ్లండ్‌ కు సరిపోతాడు: గంగూలీ

చెన్నై: తమిళనాడు ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ ను వరల్డ్‌ కప్‌ జట్టుకు ఎంపిక చేయడంపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అతనికి మద్దతు పలికాడు. ఇంగ్లండ్‌ పరిస్థితులకు విజయ్‌ సరిపోతాడన్న దాదా.. అతని బౌలింగ్‌ కీలకం కానుందన్నా డు. ‘విజయ్‌ ఇంగ్లండ్‌లో రాణిస్తాడు. అతను సత్తా ఉన్న క్రికెటర్‌ . బౌలింగ్‌ లో కీలకం కానున్నాడు. అతని గురించి చెడుగా ఆలోచించొద్దు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ లో నిరూపించుకున్నాడు కాబట్టే వరల్డ్‌ కప్‌కు ఎంపికయ్యాడు’అని గంగూలీ పేర్కొన్నా డు. రిషబ్ పంత్‌ ను ఎంపిక చేయకపోవడంపై దాదా మాట్లాడుతూ .. ‘పంత్‌ టీమ్‌ లో ఉండాల్సింది. కానీ ఏం ఫర్వాలేదు. అతని వయస్సు 20 ఏళ్లే. అతనికి ఇంకా చాలా అవకాశాలున్నాయి’ అన్నాడు.

టీమిండియా వరల్డ్‌ కప్‌లో ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలో దిగాలని భావిస్తుందని,అందుకే  ఏడో నంబర్‌ లో ఆల్‌ రౌండర్‌ను కోరుకుంటుందన్నాడు. ఆల్‌ రౌండర్‌ లో కోటాలో హార్ది క్‌ పాండ్యా జట్టు తొలి ప్రాధాన్యమన్నగంగూలీ, అతను గాయపడితే రవీంద్ర జడేజా ఉన్నాడన్నాడు. పేసర్లు ఎవరైనా గాయపడితే పది గంటలు ప్రయాణిస్తే చాలు మరో పేసర్‌ జట్టుతో కలుస్తాడని దాదా పేర్కొన్నా డు. ఈసారి ఫార్మాట్‌ వల్ల వరల్డ్‌ కప్‌ పోటాపోటీగాసాగుతుందన్న గంగూలీ, ఏ టీమ్‌ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదన్నా డు. ఐపీఎల్‌ లో వరుసగా విఫలమవుతున్న స్పిన్నర్‌  కుల్దీప్‌ యాదవ్‌ వరల్డ్‌ కప్‌లో రాణిస్తాడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.