పంత్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌ అవుతాడు..

పంత్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌ అవుతాడు..
  • పంత్‌పై గంగూలీ ప్రశంసల వర్షం

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో మెరుపు సెంచరీ చేసిన రిషబ్‌ పంత్‌ తొందర్లోనే ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌గా ఎదుగుతాడని సౌరవ్​ గంగూలీ అన్నాడు. ‘పంత్‌ ఆట నమ్మశక్యంగా లేదు. అంత ఒత్తిడిలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతనిలా చేయడం తొలిసారి కాదు.. చివరి సారి కూడా కాబోదు. మరికొన్నేళ్లలో అతను అన్ని ఫార్మాట్లలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌ అవుతాడు. పంత్‌ ఇలానే దూకుడుగా బ్యాటింగ్‌ చేయాలి. ఎందుకంటే అతనో మ్యాచ్‌ విన్నర్‌, స్పెషల్‌ క్రికెటర్‌’ అని దాదా ట్వీట్‌ చేశాడు.