ఆటగాళ్ల ఎంపికలో బీసీసీఐ తీరు మారాలి: గంగూలీ

ఆటగాళ్ల ఎంపికలో బీసీసీఐ తీరు మారాలి: గంగూలీ

బీసీసీఐ సెలక్షన్ కమిటీ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ  కెప్టెన్ సౌరవ్ గంగూలీ. వెస్టిండ్ టూర్ కు ఎంపిక చేసిన టీమిండియా జట్టును తప్పుబట్టాడు. అజింక్యా రహానేను టెస్టులకు మాత్రమే పరిమితం చేయడం, వెస్టిండిస్ ఏ తో అద్భుతంగా రాణించిన శుబ్ మన్ గిల్ కు అవకాశమివ్వకపోవడంపై ట్వీట్ చేశారు. సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లలో ఆడుతున్నవారు కొందరు మాత్రమే ఉంటున్నారని.. అన్ని ఫార్మాట్లకు ఒకే ఆటగాళ్లను ఎంపిక చేయాలని సూచించారు. అలా చేస్తే ఆటగాళ్లలో కాన్ఫిడెంట్ తో రాణిస్తారని అన్నాడు. సెలక్షన్ కమిటీ అందరినీ సంతృప్తి చెందడానికి ఎంపిక చేయకూడదని సూచించారు.