కుల్దీప్‌ తిప్పేశాడు.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌లో 247/6

కుల్దీప్‌ తిప్పేశాడు.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌లో 247/6
  • రాణించిన స్టబ్స్‌‌‌‌, బవూమ, మార్‌‌‌‌క్రమ్‌‌‌‌
  • బుమ్రా, సిరాజ్‌‌‌‌, జడేజాకు తలా ఓ వికెట్‌‌‌‌

సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌‌లో ఇండియా బౌలర్లు ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌‌కు అనుకూలమైన పిచ్‌‌పై స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌ యాదవ్‌‌ (3/48), బుమ్రా (1/38) రాణించడంతో సఫారీలకు అడ్డుకట్ట పడింది. తొలిరోజు సౌతాఫ్రికా ఆట ముగిసే 247/6 స్కోరు చేసింది.

గువాహటి: సౌతాఫ్రికాతో శనివారం ప్రారంభమైన రెండో టెస్ట్‌‌‌‌లో ఇండియా బౌలర్లు ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలమైన పిచ్‌‌‌‌పై రిస్ట్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (3/48) అద్భుతమైన టర్నింగ్‌‌‌‌ రాబడితే, పేసర్‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌ బుమ్రా (1/38) వేరియబుల్‌‌‌‌ బౌన్స్‌‌‌‌తో సఫారీలకు అడ్డుకట్ట వేశాడు. ఫలితంగా టాస్‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 81.5 ఓవర్లలో 247/6 స్కోరు చేసింది. ముత్తుసామి (25 బ్యాటింగ్‌‌‌‌), కైల్‌‌‌‌ వెరెన్‌‌‌‌ (1 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు.  ట్రిస్టాన్‌‌‌‌ స్టబ్స్‌‌‌‌ (49), కెప్టెన్‌‌‌‌ టెంబా బవూమ (41), మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (38) రాణించినా మిగతా వారు నిరాశపర్చారు. 

మెరుగైన ఆరంభం..
ఓపెనర్లు మార్‌‌‌‌క్రమ్‌‌‌‌, రికెల్టన్‌‌‌‌ (35) సఫారీలకు మెరుగైన ఆరంభం ఇచ్చారు. బుమ్రా వేసిన ఏడో ఓవర్‌‌‌‌లో రెండో స్లిప్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ వదిలేయడంతో బతికిపోయిన మార్‌‌‌‌క్రమ్‌‌‌‌తో పాటు రికెల్టన్‌‌‌‌  కూడా నిలకడగా ఆడాడు. అసమాన బౌన్స్‌‌‌‌ సంకేతాలు కనిపించకపోవడంతో బుమ్రా లాటరల్‌‌‌‌ మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌తో బ్యాట్‌‌‌‌ ఎడ్జ్‌‌‌‌లను టార్గెట్‌‌‌‌ చేశాడు. కానీ మార్‌‌‌‌క్రమ్‌‌‌‌, రికెల్టన్‌‌‌‌ కవర్‌‌‌‌ డ్రైవ్స్‌‌‌‌తో ఆకట్టుకున్నారు. రెండో ఎండ్‌‌‌‌లో సిరాజ్‌‌‌‌ (1/59) యాంగిల్‌‌‌‌ డెలివరీలతో ఇబ్బందిపెట్టాలని చూసినా మిడిల్‌‌‌‌ పిచ్‌‌‌‌కు దూరంగా ఉండటంతో బ్యాటర్లు ఈజీగా ఆడారు. 

మధ్యలో ఇద్దరు బౌలర్లు పదునైన ఆఫ్‌‌‌‌ కట్టర్స్‌‌‌‌తో ప్యాడ్లను హిట్‌‌‌‌ చేయడంతో బ్యాటర్లు కాస్త ఇబ్బందిపడ్డారు. కానీ ఎల్బీ అయ్యే చాన్స్‌‌‌‌ లేకుండా చూసుకున్నారు. డ్రింక్స్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ తర్వాత నితీశ్‌‌‌‌ రెడ్డిని బరిలోకి దించిన పంత్‌‌‌‌.. బౌలర్ల ఎండ్‌‌‌‌లను మార్చాడు. కానీ డీప్‌‌‌‌ పాయింట్‌‌‌‌, డీప్‌‌‌‌ స్క్వేర్‌‌‌‌ లెగ్‌‌‌‌, మూడు స్లిప్‌‌‌‌లను పెట్టడంతో ఔట్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ ఖాళీగా కనిపించింది. ఫలితంగా మార్‌‌‌‌క్రమ్‌‌‌‌, రికెల్టన్‌‌‌‌ ఈజీగా షాట్లు కొట్టారు. చివరకు 27వ ఓవర్‌‌‌‌లో బుమ్రా వేసిన ఇన్‌‌‌‌ స్వింగర్‌‌‌‌ను ఆడే ప్రయత్నంలో మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. దీంతో సౌతాఫ్రికా 82/1తో టీ బ్రేక్‌‌‌‌కు వెళ్లింది.

స్పిన్నర్ల జోరు..
రెండో సెషన్‌‌‌‌లో స్పిన్నర్ల జోరు కొనసాగింది. బ్రేక్‌‌‌‌ తర్వాత రెండో బాల్‌‌‌‌కే కుల్దీప్‌‌‌‌.. రికెల్టన్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేశాడు. ఔట్‌‌‌‌ సైడ్‌‌‌‌ ఫుల్‌‌‌‌ టాస్‌‌‌‌ బాల్‌‌‌‌ను ఆడే క్రమంలో రికెల్టన్‌‌‌‌.. పంత్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. సఫారీ స్కోరు 82/2గా మారింది. ఈ దశలో వచ్చిన బవూమ చాలా ప్రశాంతంగా డిఫెన్స్‌‌‌‌కు మొగ్గాడు. స్టబ్స్‌‌‌‌ కూడా కుదురుకోవడానికి టైమ్‌‌‌‌ తీసుకోవడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా ముందుకెళ్లింది. తర్వాత కుల్దీప్‌‌‌‌ను టార్గెట్‌‌‌‌ చేసి భారీ సిక్స్‌‌‌‌ కొట్టిన స్టబ్స్‌‌‌‌ లాంగ్‌‌‌‌ స్ట్రైడ్స్‌‌‌‌తో బాల్స్‌‌‌‌ను అడ్డుకున్నాడు. ఈ సెషన్‌‌‌‌ మొత్తం వీరిద్దరు స్పిన్‌‌‌‌–పేస్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌ను దీటుగా ఎదుర్కొన్నారు. ఫలితంగా 29.5 ఓవర్లలో 74 రన్స్‌‌‌‌ జోడించి 156/2తో లంచ్‌‌‌‌కు వెళ్లారు. మూడో సెషన్‌‌‌‌ ఆరంభంలోనే సౌతాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి వరకు చాలా నిలకడగా ఆడిన బవూమాను జడేజా (14/30) బోల్తా కొట్టించాడు.

ఓ ఫుల్‌ టాస్‌‌‌బాల్‌‌‌‌ను ఔట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద స్టంప్‌‌‌‌గా వేయడంతో బవూమ షాట్‌‌‌‌ కొట్టగా మిడాఫ్‌‌‌‌లో జైస్వాల్‌‌‌‌ సూపర్‌‌‌‌గా అందుకున్నాడు. మూడో వికెట్‌‌‌‌కు 84 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. కొద్దిసేపటికే  ఏకాగ్రత కోల్పోయిన స్టబ్స్‌‌‌‌.. కుల్దీప్‌ ఫుల్‌‌ యాంగిల్‌ ‌బాల్‌‌‌‌ను అడ్డంగా ఆడబోయి ఫస్ట్‌‌‌‌ స్లిప్‌‌‌‌లో రాహుల్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. ఈ టైమ్‌‌‌‌లో టోనీ డి జోర్జి (28) ఆదుకునే ప్రయత్నం చేసినా రెండో ఎండ్‌‌‌‌లో సహకారం కరువైంది.

కొద్దిసేపటికే కుల్దీప్‌‌‌‌.. బవూమను ఔట్‌‌‌‌ చేసినట్లుగానే వియాన్‌‌‌‌ ముల్డర్‌‌‌‌ (13)ను పెవిలియన్‌‌‌‌కు పంపాడు. ఓ దశలో 166/2 స్కోరుతో పటిష్టంగా కనిపించిన ప్రొటీస్‌‌‌‌  201/5 కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి జోర్జి, ముత్తుసామి దాదాపు 14 ఓవర్లు ఇండియన్‌‌‌‌ బౌలర్లను విసిగించారు. అయితే కొత్త బాల్‌‌‌‌తో సిరాజ్‌‌‌‌.. ముల్డర్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేశాడు. పంత్‌‌‌‌ డైవ్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ను అద్భుతంగా అందుకున్నాడు. ఆరో వికెట్‌‌‌‌కు 45 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగియడంతో సఫారీ 247/6 వద్ద తొలి రోజు ఆటను ముగించింది.

సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 81.5 ఓవర్లలో 247/6 (స్టబ్స్‌‌‌‌ 49, బవూమ 41, మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ 38, కుల్దీప్‌‌‌‌ 3/48).