IND vs SA: సిరీస్ మనదే: సౌతాఫ్రికా-ఏ తో మూడో వన్డేలో ఓడిన ఇండియా-ఏ

IND vs SA: సిరీస్ మనదే: సౌతాఫ్రికా-ఏ తో మూడో వన్డేలో ఓడిన ఇండియా-ఏ

సౌతాఫ్రికా–ఎ జట్టుతో జరిగిన మూడో వన్డేలో ఇండియా-ఏ ఓడిపోయింది. బుధవారం (నవంబర్ 19) రాజ్ కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా-ఏ పై  సౌతాఫ్రికా–ఎ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ల్హువాన్-డ్రే ప్రిటోరియస్ (123), రివాల్డో మూన్సామి(107) సెంచరీలతో చెలరేగి సఫారీ విజయంలో కీలక పాత్ర పోషించారు. భారీ ఛేజింగ్ లో ఇండియా పోరాడకుండానే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా-ఏ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో భారత-ఏ జట్టు 252 పరుగులకు ఆలౌటైంది.

మూడో వన్డేలో ఓడిపోయినా మొదటి రెండు వన్డేలు గెలిచిన భారత-ఏ జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా-ఏ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ల్హువాన్-డ్రే ప్రిటోరియస్ (123), రివాల్డో మూన్సామి(107) శతాకాలు బాది తొలి వికెట్ కు ఏకంగా 241 పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్, హర్షిత్ రానా, ప్రసిద్ కృష్ణ తలో రెండు వికెట్లు పడగొట్టారు. భారీ ఛేజింగ్ లో ఇండియా-ఏ ఏ దశలోనూ పోరాడలేకపోయింది. ఇషాన్ కిషాన్ (53), ఆయుష్ బదోని (66) హాఫ్ సెంచరీలు చేసి కాస్త పోరాడినా విజయానికి ఏ మాత్రం సరిపోలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో న్కాబయోంజీ పీటర్ నాలుగు వికెట్లు పడగొట్టి విజయాన్ని అందించాడు.           

తొలి రెండు వన్డేలు మనవే:
 
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (117) సెంచరీతో విజృంభించడంతో సౌతాఫ్రికా–ఎ జట్టుతో జరిగిన తొలి అనధికారిక వన్డే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా-ఏ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా గురువారం (నవంబర్ 13) జరిగిన ఈ పోరులో తొలుత సౌతాఫ్రికా టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 285/9 స్కోరు చేసింది. ఇండియా–ఎ 49.3 ఓవర్లలో 290/6 స్కోరు చేసి గెలిచింది. గైక్వాడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.  

రెండో వన్డే విషయానికి వస్తే ఇండియా-ఏ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత సౌతాఫ్రికా–ఎ 30.3 ఓవర్లలో 132 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. రివల్డో మూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సామి (33) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. హర్షిత్ రాణా (3/21), ప్రసిధ్ కృష్ణ (2/21) కూడా రాణించారు.  అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా–ఎ 27.5 ఓవర్లలోనే 135/1 స్కోరు చేసి గెలిచింది. నిషాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించించింది.