
జొహానెస్‌బర్గ్: ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు సౌతాఫ్రికా15 మందితో కూడిన బలమైన జట్టును ప్రకటించింది. గత అక్టోబరులో చివరిసారి టెస్ట్ ఆడిన పేసర్ లుంగి ఎంగిడి ఈ మెగా మ్యాచ్ కోసం జట్టులోకి తిరిగి వచ్చాడు. డ్రగ్ టెస్టులో ఫెయిలై ఒక నెల సస్పెన్షన్ ఎదుర్కొని తిరిగొచ్చిన కగిసో రబాడ జట్టులో ప్రధాన పేసర్‌గా ఉండగా మొత్తం ఆరుగురు ఫాస్ట్ బౌలర్లు ఈ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. మంగళవారం ప్రకటించిన ఈ టీమ్‌లో స్పిన్నర్లుగా కేశవ్ మహారాజ్, సెనురన్ ముత్తుసామి ఎంపికయ్యారు.
టెంబా బవూమ నేతృత్వం వహించే ఈ జట్టులో బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా మార్కో యాన్సెన్, వియాన్ ముల్డర్, కార్బిన్ బోష్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్‌లో ఐడెన్ మార్‌క్రమ్, టోనీ డిజోర్జీ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టాన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్ లాంటి యంగ్‌స్టర్స్‌కు తోడు వికెట్‌కీపర్‌గా కైల్ వెరెన్ ఎంపికయ్యాడు. రికెల్టన్ రూపంలో బ్యాకప్ కీపర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసిన సఫారీ టీమ్ ఈ నెల 31న ఇంగ్లండ్‌లోని అరండెల్‌లో ఒక్క చోటుకు చేరుతుంది. జూన్ 3 నుంచి 6 వరకు జింబాబ్వేతో వామప్ మ్యాచ్ ఆడనుంది.
సౌతాఫ్రికా టీమ్:
టెంబా బవూమ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, కార్బిన్ బాష్, టోనీ డి జోర్జి, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్‌క్రమ్, వియాన్ మల్డర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, డేన్ పాటర్సన్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), ట్రిస్టాన్ స్టబ్స్, కైల్ వెరెన్ (వికెట్ కీపర్).