World Cup 2023: అదరగొట్టిన నెదర్లాండ్స్ .. దక్షిణాఫ్రికా ముందు ఛాలెంజింగ్ టార్గెట్

World Cup 2023: అదరగొట్టిన నెదర్లాండ్స్ .. దక్షిణాఫ్రికా ముందు ఛాలెంజింగ్ టార్గెట్

వరల్డ్  కప్ లో పసికూనగా భావించిన నెదర్లాండ్స్ జట్టు కీలక సమయంలో గాడిలో పడింది. వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన డచ్.. సఫారీలపై అద్భుతంగా బ్యాటింగ్ చేసి చాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. పంజాబ్ లోని ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచులో దక్షిణాఫ్రికాపై గెలిచి షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 

పంజాబ్ లోని ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ ఒడి బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 8 వికెట్లను 245 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచును 43 ఓవర్లకు కుదించగా.. నెదర్లాండ్స్ ఆటగాళ్లు స్థాయికి మించి రాణించారనే చెప్పాలి. ఒకదశలో 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఈ జట్టుని కెప్టెన్ ఎడ్వార్డ్స్  లోయర్ ఆర్డర్ తో కలిసి జట్టు స్కోర్ ని 200 పరుగులు దాటించాడు.

Also Read :- హీరోలా రోహిత్ శర్మ

ఎడ్వార్డ్స్ 69 బంతుల్లో 78 పరుగులు చేయగా.. లోయర్ ఆర్డర్ లో వాండెర్ మెర్వ్( 19 బంతుల్లో 29), ఆర్యన్ దత్(9 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జాన్సెన్, రబడా తలో రెండు వికెట్లు తీసుకోగా.. కొయెట్జ్, మహారాజ్ కి ఒక వికెట్ దక్కింది.