ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేసిన దక్షిణాఫ్రికా

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేసిన దక్షిణాఫ్రికా

ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ పై దక్షిణాఫ్రికా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ ను అరికట్టడంలో సమర్ధవంతంగా పనిచేయడం లేదంటూ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేసింది. దీనిపై స్పందించిన బ్రిటన్ వర్గాలు… కరోనా మరణాలను, తీవ్ర అస్వస్థతను నివారించడంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ విఫలమవుతోందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నాయి. అయితే దక్షిణాఫ్రికా ఈ వ్యాక్సిన్ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసిందని బ్రిటన్ సహాయ మంత్రి ఎడ్వర్డ్ ఆర్గర్ తెలిపారు. తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న కరోనా స్ట్రెయిన్ పైనా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రకటించింది.