సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి రోజు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. టాస్ ఓడిపోయినప్పటికీ బౌలింగ్ లో రాణించి సౌతాఫ్రికా మూడు కీలక వికెట్లు పడగొట్టింది. శుక్రవారం (నవంబర్ 14) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో తొలి రోజు మొదటి సెషన్ లో సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజ్ లో క్రీజ్ లో టోనీ డి జోర్జీ (15), వియాన్ ముల్డర్ (22) ఉన్నారు. ఇండియా బౌలర్లలో బుమ్రా రెండు.. కుల్దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. సౌతాఫ్రికా ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ (31), ర్యాన్ రికెల్టన్ (23) పర్వాలేదనిపించారు. కెప్టెన్ బవుమా 3 పరుగులు చేసి నిరాశపరిచాడు.
తొలి గంట సఫారీలదే:
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ తీసుకుంది. తమ నిర్ణయం కరెక్ట్ అని నిరూపిస్తూ సఫారీ ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ (31), ర్యాన్ రికెల్టన్ (23) తొలి వికెట్ కు మంచి ఆరంభం ఇచ్చారు. ఓ వైపు మార్కరం పరుగులు చేయడానికి ఇబ్బందిపడినా మరో ఎండ్ లో రికెల్టన్ బౌండరీల వర్షం కురిపించాడు. 23 బంతికి పరుగుల ఖాతా తెరిచిన మార్క్రామ్ క్రమంగా బ్యాట్ ఝుళిపించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఆధిపత్యం చూపిస్తూ ఈ సఫారీ ఓపెనర్ వేగంగా పరుగులు రాబట్టాడు. అద్భుతంగా ఆడుతున్న వీరిద్దరి జోడీ తొలి వికెట్ కు 57 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోర్ దిశగా బాటలు వేశారు.
బుమ్రా దెబ్బకు సఫారీ ఓపెనర్లు ఔట్:
ప్రమాదకరంగా మారుతున్న మార్క్రామ్ (31), రికెల్టన్ (23) జోడీని బుమ్రా విడగొట్టాడు. ఒక ఇన్ స్వింగ్ బాల్ తో రికెల్టన్ ను బౌల్డ్ చేశాడు. దీంతో 57 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్ లో కుదురుకుని మంచి టచ్ లో కనిపించిన మార్క్రామ్ ను బుమ్రా ఒక ఎక్స్ ట్రా బౌన్సర్ తో బోల్తా కొట్టించాడు. వెంటనే కుల్దీప్ యాదవ్ రంగంలోకి దిగి సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (3) ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో వికెట్ నష్టపోకుండా 57 పరుగులతో పటిష్టంగా ఉన్న సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 71 పరుగులతో కష్టాల్లో పడింది. ఈ దశలో సౌతాఫ్రికా జట్టును టోనీ డి జోర్జీ (15), వియాన్ ముల్డర్ (22) ఆదుకున్నారు. 11 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి లంచ్ వరకు మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ముగించారు.
Lunch on Day 1.
— BCCI (@BCCI) November 14, 2025
2⃣ wickets for Jasprit Bumrah and 1⃣ wicket for Kuldeep Yadav in an entertaining first session of the series 👌
We will be back soon with the 2nd session 👍
Scorecard ▶️ https://t.co/okTBo3qxVH#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/G0rMk1w0dz
