సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు రాణించారు. శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి సౌతాఫ్రికాను ఒక మాదిరి స్కోర్ కే పరిమితం చేశారు. కుల్దీప్ యాదవ్ స్పిన్ మ్యాజిక్ కు తోడు.. ప్రసిద్ కృష్ణ తన పేస్ తో విజృంభించడంతో సఫారీలను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. మరోవైపు ఓపెనర్ క్వింటన్ డి కాక్ (106) సెంచరీతో సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బవుమా 48 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. జడేజా, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు తొలి ఓవర్లోనే ఆర్షేదీప్ సింగ్ బిగ్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ రికెల్ టన్ ఔట్ చేసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఆరంభంలోనే రికెల్ టన్ వికెట్ కోల్పోవడంతో కెప్టెన్ బవుమా, వికెట్ కీపర్ డికాక్ ఆచితూచి ఆడారు. ఆ తర్వాత క్రమంగా వీరిద్దరూ బ్యాట్ ఝుళిపించాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్ కు కెప్టెన్ బవుమా, డికాక్ కలిసి 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని జడేజా విడగొట్టి ఇండియాకు రెండో వికెట్ అందించాడు.
మాథ్యూ బ్రీట్జ్కేతో కలిసి డికాక్ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్.. హాఫ్ సెంచరీ తరువాత దూకుడు పెంచాడు. 30 ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్ లో సిక్సర్ కొట్టి 80 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. బ్రీట్జ్కే వికెట్ ప్రసిద్ కృష్ణ పడగొట్టడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఆతర్వాత వెంటనే ఒక అద్భుత యార్కర్ తో డికాక్ ను బౌల్డ్ చేశాడు. వేగంగా ఆడే క్రమంలో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. బ్రేవీస్ (29), జాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) స్వల్ప వ్యవధిలో ఔటవ్వడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేయలేక 270 పరుగులకు ఆలౌటైంది.
South Africa are all out for 2⃣7⃣0⃣ in Vizag
— BCCI (@BCCI) December 6, 2025
Prasidh Krishna with the final wicket of the innings 😎
He finishes with a four-wicket haul 🙌
Scorecard ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/5mays2y5uS
