దక్షిణాఫ్రికా నవలా రచయిత డామన్ గాల్గట్‌కు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ అవార్డు ఈ ఏడాదికిగాను దక్కింది. ఆయన రచించిన 'ది ప్రామిస్` నవల అవార్డుకు ఎంపికైంది.
ఫైనల్ లిస్ట్‌లో ముగ్గురు రచయితలు రిచర్డ్ పవర్స్ (బివిల్డర్‌మెంట్), మ్యాగీ షిప్‌స్టెడ్ (గ్రేట్ సర్కిల్) ప్యాట్రిసియా లాక్‌వుడ్ (నో వన్ ఈజ్ టాకింగ్ అబౌట్)తో పాటు శ్రీలంక రచయిత అనుక్ అరుద్ ప్రసంగం (ఏ పాసేజ్ నార్త్), బ్రిటీష్ అండ్ సోమాలి నవలా రచయిత నదిఫా మొహమ్మద్ (ది ఫార్చ్యూన్ మెన్) రచనలు బుకర్‌ప్రైజ్ కోసం పోటీపడ్డాయి. అయితే న్యాయనిర్ణేతలు ది ప్రామిస్ నవలనే ఎంపిక చేశారు.
డామన్ గల్గట్ బుకర్ ప్రైజ్‌కు ఎంపికవడంతో పాటు 68వేల డాలర్ల నగదు పారితోషకాన్ని అందుకోనున్నారు.
