
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తర తెలంగాణ అతలాకుతలం అయ్యింది. తెలంగణా వ్యాప్తంగా విస్తరించిన చక్రవాక ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలకు రోడ్లు, రైల్వే ట్రాక్ లు చాలా మేరకు ధ్వంసమయ్యాయి. దీంతో దక్షణిమధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.
భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే లో రైళ్ల రద్దు కొనసాగుతోంది. కామారెడ్డి, మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి, బికనూర్,- తలమడ్ల, అకన్పేట్, మెదక్ రైల్వే ట్రాక్ మీద నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీనికితోడు ట్రాకులు పూర్తిగా దెబ్బతిన్నాయి.
దీంతో ఇప్పటికే కొన్ని రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇప్పటి వరకు 10 రైళ్లు రద్దు చేయగా, 16 రైళ్లను దారి మళ్లించారు. మరి కొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశారు.
ALSO READ : ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఉధృతి..
కరీంనగర్-కాచిగూడ, కాచిగూడ-నిజామాబాద్, మెదక్-కాచిగూడ, బోధన్-కాచిగూడ, ఆదిలాబాద్-తిరుపతి , తిరుపతి-నిజామాబాద్ రైళ్లను రద్దు చేశారు అధికారులు. రైళ్ల రద్దు , దారి మళ్లింపు సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రైళ్ల రద్దుకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.
సంప్రదించాల్సిన నెంబర్లు:
కాచిగూడ: 9063318082
నిజామాబాద్: 970329671
కామారెడ్డి: 9281035664
సికింద్రాబాద్: 040 - 277 86170