
- ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఉధృతి
- శంభుమత్తడిగూడ వాగులో చిక్కుకున్న చిన్నారులు..
- వేలాలలో నీటమునిగిన పత్తిచేన్లు
- నిర్మల్ జిల్లా అక్కాపూర్ లో నేల కూలిన వందేళ్ల నాటి మర్రిచెట్టు
ఆదిలాబాద్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. దీంతో సమీప ప్రాంతాల్లోని పంట చేన్లు నీట మునిగాయి. పలుగ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో జనజీవన స్తంభించిపోయింది.
ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండలంలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు శంభుమత్తడిగూడలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. గ్రామం వీధులు పూర్తిగా నీట మునిగాయి. కిరాణా దుకాణానికి వెళ్లిన చిన్నారులు వరదలో చిక్కుకున్నారు. దీంతో గ్రామస్తులు వారిని కాపాడారు. గ్రామస్తుడు పిల్లలను భుజాన ఎత్తుకొని వాగు దాటిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండలంలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు శంభుమత్తడిగూడలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చిన్నారులు వరదలో చిక్కుకున్నారు. గ్రామస్తులు వారిని కాపాడారు. pic.twitter.com/5xNpEbNj8o
— దివిటి ఛానల్ (@risingsun143) August 28, 2025
మరోవైపు గురువారం (ఆగస్టు 28) ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండలం వేలాల గ్రామంలో పత్తి చేన్లు, వరిపొలాలు పూర్తిగా నీటమునిగాయి. వందలాది ఎకరాల పంట పొలాలు నీటి పాలయ్యింది. చేతికొచ్చే సమయంలో పత్తి పంట నీటమునగడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని రౌతులు ఆందోళన వ్యక్తం చేశారు.
►ALSO READ | లోయర్ మానేర్ డ్యామ్ గేట్లు రేపు (ఆగస్టు 29) ఎత్తుతరంట.. కరీంనగర్ జిల్లా ప్రజలు జర జాగ్రత్త !
గతంలో కూడా గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో పరివాహక ప్రాంతం అయిన వేలాలలో నివాస గృహాలు, పంట పొలాలు నీటమునిగాయి.. దీంతో గ్రామాన్ని ఖాళీ చేసి గుట్ట ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చిందని గ్రామస్తులు వాపోతున్నారు. నిన్న కురిసిన వర్షాలకు కూడా గోదావరి వరద నీటితో పత్తి చేన్లు, వరిపొలాలు నీటమునిగాయి. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా కంటితుడుపు చర్యలు చేపట్టారు. వేలాల వరద ముంపుకు శాశ్వతం పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వేలాలతోపాటు జైపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కరకట్ట నిర్మాణం చేపట్టి పంట నష్టాన్ని తగ్గించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా అక్కాపూర్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుండపోత వర్షాలకు కట్టమైసమ్మ దగ్గర ఉన్న మర్రిచెట్టు కూలింది. ఈ చెట్టు వంద సంవత్సరాల నాటిది. వేర్లతో సహ కూలిపోయింది.