లోయర్ మానేర్ డ్యామ్ గేట్లు రేపు (ఆగస్టు 29) ఎత్తుతరంట.. కరీంనగర్ జిల్లా ప్రజలు జర జాగ్రత్త !

లోయర్ మానేర్ డ్యామ్ గేట్లు రేపు (ఆగస్టు 29) ఎత్తుతరంట.. కరీంనగర్ జిల్లా ప్రజలు జర జాగ్రత్త !

కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలతో లోయర్ మానేర్ డ్యామ్ కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో డ్యాం నిండు కుండలా మారిపోయింది. వరద ప్రవాహం రాను రాను పెరుగుతుండటంతో నీళ్లను కిందికి వదలాలని అధికారులు నిర్ణయించారు. డ్యామ్ పూర్తిస్థాయి సామర్థ్యానికి వరద నీరు చేరుకోవడంతో నీళ్లను వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

రేపు (శుక్రవారం, ఆగస్టు 29)  లోయర్ మానేర్ డ్యామ్  గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో వరద హెచ్చరికలు జారీ చేశారు ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేశ్. గత రెండు రోజుల వర్షాల కారణంగా, మిడ్ మానేరు నుండి వచ్చిన వరద కారణంగా నీటి మట్టం పెరుగుతుందని అన్నారు. రేపు (29-08-2025) ఉదయం 9 నుండి 10 గంటల మధ్య స్పిల్ వే గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలిపారు. 

ALSO READ : గోదావరిఖనిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి..

డ్యామ్ దిగువ ప్రాంత ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, రైతులు, చేపలు పట్టేవారు నదిని దాటరాదని హెచ్చరించారు. వరద హెచ్చరికలు అక్టోబర్ చివరి వరకు వర్తిస్తాయని తెలిపారు.