24 స్పెషల్ రైలు సర్వీసుల పొడిగింపు

24 స్పెషల్ రైలు సర్వీసుల పొడిగింపు

హైదరాబాద్: కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలవుతున్న నేపధ్యంలో ప్రస్తుతం 24 స్పెషల్ రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా.. ప్రయాణికులు లేక చాలా వరకు రైలు సర్వీసులన్నీ రద్దయిన విషయం తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ దూర ప్రాంత ప్రయాణికుల కోసం వీక్లీ, బై వీక్లీ దూర ప్రాంత సర్వీసులు నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరు స్పెషల్ రైళ్లు రోజూ నడుస్తున్నాయి.
దేశమంతటా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తూ.. దాదాపు గా ఎత్తేస్తున్న పరిస్థితుల్లో 24 స్పెషల్ రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులో తెచ్చింది. ఈ స్పెషల్ రైళ్లలో ప్రయాణించాలంటే ముందుగా రిజర్వు చేసుకోవాల్సిందే. వీటిలో ఆరు రైళ్లు ప్రతి రోజు రాకపోకలు సాగిస్తుండగా..ఇంకో రెండు రైళ్లు వారంలో ఒకసారి.. మరో 16 రైల్లు వారంలో ఒకసారి రాకపోకలు సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల గుండా తిరగనున్న ప్రత్యేక రైళ్ల  వివరాలను దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ లో ప్రకటించింది.