త్వరలో రాష్ట్రంలో జరగాల్సిన రైల్వే పనులు వేగవంతమవుతాయ్

త్వరలో రాష్ట్రంలో జరగాల్సిన రైల్వే పనులు వేగవంతమవుతాయ్

దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పార్లమెంట్ సభ్యులతో ఈ గురువారం సమావేశమయ్యారు.  సమావేశంలో  రైల్వే సమస్యలు, రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై చర్చ జరిపారు. ఈ చర్చలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి సహా  నామా నాగేశ్వరరావు, సోయం బాబురావు,బండి సంజయ్, అరవింద్, రాయచూర్ ఎంపీ అమ్రేశ్వర్ నాయక్, రంజిత్ రెడ్డి,  గుల్బర్గా ఎంపీ ఉమేష్ జి యాదవ్, నాగర్ కర్నూలు ఎంపీ.రాములు,  రాజ్యసభ సభ్యులు కేకే, బండ ప్రకాశ్ లు పాల్గోన్నారు.

ఈ సమావేశంలో ప్రాజెక్టుల అభివృద్ధి పై,  కొత్త ప్రాజెక్టులు.. కొత్తలైన్ల నిర్మాణం పై చర్చించామని జీఎం గజానన్ మాల్యా చెప్పారు.  కొత్తగా సర్వే చేస్తున్న లైన్ల పైన,  ప్రయాణికుల సౌకర్యాలు, సెక్యూరిటి పైనా చర్చించామన్నారు. కాజీపేట ఫ్యాక్టరీ తో పాటు అనేక ప్రాజెక్టులపై చర్చ జరిగిందని, ఈ సమావేశం తరువాత రాష్ట్రంలో జరగాల్సిన పనులు వేగంవంతం అవుతాయని ఆశిస్తున్నానని గజానన్ అన్నారు.

South Central Railway GM Gajanan Mallya met MPs on Thursday