హైదరాబాద్, వెలుగు: పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దాదాపు 400 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్శ్రీవాస్తవ తెలిపారు. ప్రధాన స్టేషన్లలో రోజువారీ ప్రయాణికుల రద్దీ సుమారు 4.6 లక్షలకు చేరనున్నట్లు చెప్పారు. ఛత్ పూజ పండుగ సందర్భంగా దర్భంగా, పాట్నా, ఛప్రా, ససారం, దానాపూర్, గోరఖ్పూర్, ప్రయాగ్రాజ్, షాలిమార్, హౌరా వంటి అధిక డిమాండ్ ఉన్న గమ్యస్థానాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల ఏర్పాటు ద్వారా జనరల్ టికెటింగ్ సదుపాయాలను మెరుగుపరిచారు. క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా టికెట్లను సులభంగా కొనుగోలు చేసేందుకు యూటీస్ మొబైల్ యాప్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం టికెట్ కౌంటర్ల వద్ద, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో క్యూ ఆర్ కోడ్లను ప్రదర్శిస్తున్నారు.
