V6 News

సంక్రాంతికి 14 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి 14 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: సంక్రాంతి పండుగ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అధికారులు 14 ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు సొంతూళ్లకు వెళ్లడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. రైలు టకెట్​ల బుకింగ్స్ కూడా కొనసాగుతోంది. రద్దీని తట్టుకునేందుకు రైల్వే అధికారులు  సొంతూర్లకు వెళ్లే వారి కోసం బుకింగ్​ ఆప్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రెయిన్​నెం. 07041 సికింద్రాబాద్​–అనకాపల్లి మధ్య 2026 జనవరి 4, 11,18,తేదీలు.. ఆదివారాల్లో 3 సర్వీసులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. 

అలాగే.. ట్రెయిన్​నెం.07042 అనకాపల్లి – సికింద్రాబాద్​ మధ్య జనవరి 5,12,19 తేదీల్లో సోమవారాల్లో 3 సర్వీసులు, ట్రెయిన్​నెం. 07075 హైదరాబాద్​–గోరఖ్​పూర్​ మధ్య శుక్రవారాల్లో జనవరి 9,16,23 తేదీల్లో 4 సర్వీసులు, ట్రెయిన్​నెం. 07076, గోరఖ్​పూర్​–హైదరాబాద్​ మధ్య ఆదివారాల్లో జనవరి 11,18,25 తేదీల్లో 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.