
- వచ్చే నెల 1 నుంచి జులై 31 వరకు సర్వీసులు
హైదరాబాద్సిటీ, వెలుగు: వేసవి సెలవుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ప్రవేశపెట్టామని దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సీఆర్) అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా బెంగళూరు, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు 44 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతి ఆదివారం ట్రైన్ నంబర్ 08581 విశాఖపట్నం–ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య జూన్1 నుంచి 29 వరకు 5 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు.
ట్రైన్ నంబర్08582 ఎస్ఎంవీటీ బెంగళూరు – విశాఖపట్నం మధ్య ప్రతి సోమవారం జూన్ 2 నుంచి 30 వరకు 5 సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట, జోలార్పట్టి, కుప్పం, బంగార్పేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయని వివరించారు. ‘‘ట్రైన్
నంబర్ 08547 విశాఖపట్నం– తిరుపతి మధ్య ప్రతి బుధవారం జూన్4 నుంచి జులై 30 వరకు 9 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
అలాగే, ట్రెయిన్ నంబర్ 08548 తిరుపతి – విశాఖపట్నం మధ్య ప్రతి గురువారం జూన్5 నుంచి జులై 31 వరకు 9 సర్వీసులు నడుస్తాయి. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలిమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరంటౌన్, కల్కలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ట్రైన్ నంబర్ 08578 విశాఖపట్నం–చర్లపల్లి మీదుగా జూన్ 6 నుంచి జులై 25 వరకు ప్రతి శుక్రవారం 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ట్రైన్ నంబర్ 08580 చర్లపల్లి–విశాఖ పట్నం మధ్య జూన్7 నుంచి జులై 26 వరకు ప్రతి శనివారం 8 సర్వీసులు నడుస్తాయి’’ అని అధికారులు వివరించారు. ఆ ప్రత్యేక రైళ్లన్నీ దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.