
మరోసారి మన సౌత్ సినిమా సత్తా చాటింది. శుక్రవారం ప్రకటించిన 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రంగా మలయాళం నుంచి ‘ఆట్టమ్’ నిలిచింది. ఉత్తమ నటుడిగా కన్నడ హీరో రిషబ్ శెట్టి ఎంపికయ్యారు. ఉత్తమ హీరోయిన్ అవార్డు నిత్యామీనన్‌ను వరించింది. అలాగే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీలాంటి ప్రముఖమైన కేటగిరీల్లో సౌత్ ఇండియన్ సినిమాలకు ప్రాధాన్యత లభించింది. ఇక ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ2’ నిలిచింది.
ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు:
తెలుగు: కార్తికేయ 2
తమిళం:
పొన్నియిన్ సెల్వన్ - 1
కన్నడ: కేజీయఫ్ 2
ఒడియా: దమన్
మలయాళం: సౌది వెళ్లక్క సీసీ
మరాఠీ : వాల్వీ (ది టెర్మైట్)
హిందీ: గుల్మౌహర్
బెంగాళీ : కబేరి అంతర్జాన్
పంజాబీ : బాగీ డి దీ
విజేతలు వీరే:
ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం)
ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార కన్నడ)
ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రంబళం తమిళం),
మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ ప్రెస్ గుజరాతీ)
ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి హిందీ)
ఉత్తమ దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్, ఫౌజా (హరియాన్వీ)
ఉత్తమ హోల్సమ్ ఎంటర్‌టైన్మెంట్: కాంతార (కన్నడ)
బెస్ట్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషన్, సోషల్, ఎన్విరాన్మెంటల్ వాల్యూస్: కచ్ ఎక్స్ ప్రెస్ (గుజరాత్)
ఉత్తమ సహాయ నటుడు: పవన్ రాజ్ మల్హోత్రా, ఫౌజా, (-హరియాన్వి)
ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)
ఉత్తమ బాల నటుడు: శ్రీపాద్ (మలికాపురమ్ మలయాళం)
ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్ , బ్రహ్మస్త్ర- పార్ట్ 1 శివ (హిందీ)
ఉత్తమ నేపథ్య సంగీతం : ఏఆర్ రెహమాన్, పొన్నియిన్ సెల్వన్- 1 (తమిళం)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ : ఆర్జిత్ సింగ్ (కేసరియా) బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ (హిందీ)
బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్: బాంబే జయశ్రీ (చాయుమ్ వెయిల్), సౌదీ వెల్లక
ఉత్తమ సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి, పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)
ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీయఫ్ 2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్, పొన్నియిన్ సెల్వన్: పార్ట్- 1 (తమిళం),
ఉత్తమ కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ మాస్టర్ (తిరుచిత్రంబళం -తమిళం)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): - ఆనంద్ ఏకార్షి, ఆట్టమ్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ (హిందీ)
ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్, ఆట్టమ్
ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్మాహర్)
ఉత్తమ లిరిక్స్: నౌషద్ సదర్ ఖాన్, ఫౌజా (హరియాన్వీ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నిక్కి జోషి (కచ్ ఎక్స్ ప్రెస్ గుజరాతీ)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఆనంద అద్య (అపరాజితో), బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్: సోమనాథ్ కుందు, (అపరాజితో -బెంగాళీ),
స్పెషల్ మెన్షన్: గుల్ మోహర్ (హిందీ), నటుడు: మనోజ్ బాజ్పాయ్, కదికన్ (మలయాళం),
సంగీత దర్శకుడు: సంజోయ్ సలీల్ చౌదురి
ఉత్తమ చిత్రం..ఆట్టమ్
ఈసారి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును మలయాళ చిత్రం ‘ఆట్టమ్’ సొంతం చేసుకుంది. 2022లోనే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలైంది మాత్రం ఈ ఏడాది జనవరిలో. ఆనంద్ ఏకర్షి దీనికి దర్శకుడు. నాటకాలు వేసే 13 మంది బృందంలో ఉన్న ఏకైక యువతిపై లైంగిక దాడి జరగడం, ఆ నేరం ఎవరు చేశారు అనే విషయం చుట్టూ తిరిగే కథ ఇది. అమెరికన్ కోర్ట్ రూమ్ సిరీస్ ‘12 యాంగ్రీమెన్’ దీనికి స్ఫూర్తి. ఇదొక సస్పెన్స్ డ్రామా అయినప్పటికీ మనుషుల వ్యక్తిత్వాన్ని గురించిన కథ. అవసరానికి తగ్గట్టు మారే మనిషిలోని రెండు కోణాలను చూపిస్తుంది. ప్రస్తుత సామాజిక పరిస్థితులను, మనుషుల నైజాన్ని ఎత్తిచూపించేలా తెరకెక్కించారు. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటర్ అవార్డులు కూడా ఈ చిత్రానికి లభించాయి.
ఇద్దరికి ఉత్తమ నటి కిరీటం
కెరీర్ ప్రారంభం నుంచి నటనకు ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకుంటూ సెలెక్టివ్‌గా సినిమాలు చేసే నిత్యామీనన్.. ఈసారి ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. తమిళ చిత్రం ‘తిరుచిత్రంబళం’లోని తన నటనకుగానూ అవార్డును నిత్యామీనన్ కైవసం చేసుకున్నారు. ఇందులో ధనుష్ పాత్రను సపోర్ట్ చేసే స్నేహితురాలిగా తన నటన ఆకట్టుకుంది. ఇక నిత్యతో పాటు మానసి పరేఖ్ ఉత్తమ నటిగా అవార్డును పంచుకున్నారు. సీరియల్స్ నుంచి సినిమా వైపు వచ్చిన మానసి.. గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’తో ఈ అవార్డును కైవసం చేసుకున్నారు.
టెక్నికల్‌గా మెప్పించిన పొన్నియిన్ సెల్వన్
చోళుల కథతో మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1’ ఈసారి జాతీయ అవార్డుల్లో మెప్పించింది. విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రానికి నాలుగు అవార్డులు వచ్చాయి. ఉత్తమ నేపథ్య సంగీతానికి రెహమాన్. బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా రవి వర్మన్, బెస్ట్ సౌండ్ డిజైనర్‌గా ఆనంద్ కృష్ణమూర్తి నిలిచారు. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగానూ నిలిచింది.
భూత కోలాతో బెస్ట్ యాక్టర్‌గా..
‘కాంతార’ చిత్రంతో కన్నడతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రిషబ్ శెట్టి.. ఇప్పుడు జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఈ చిత్రంలోని అద్భుతమైన నటనకు గాను బెస్ట్ యాక్టర్‌గా నిలిచాడు. తను హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదట కన్నడలో మాత్రమే విడుదలైంది. తులు సంప్రదాయమైన భూత కోలా ప్రదర్శన నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం మౌత్ టాక్‌తో ఒక్కో భాషలో రీమేక్ అవుతూ బాక్సాపీస్ దండయాత్ర చేసింది. ఇక రిషబ్.. కర్ణాటకలోని కెరాడి అనే మారుమూల గ్రామంలోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు.
ఓవైపు వాటర్ క్యాన్‌లు అమ్మడం, హోటల్ నడపడం లాంటి చిన్న వ్యాపారాలు చేస్తూ, మరోవైపు సినిమా ప్రయత్నాలు చేశాడు. క్లాప్ బాయ్, స్పాట్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. రక్షిత్ శెట్టి హీరోగా తీసిన ‘రిక్కీ’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, ‘కిరిక్ పార్టీ’తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ డబ్బుతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘సర్కారి హిరియ ప్రాథమిక శాలే, కాసరగోడు’ అనే చిత్రం తీశాడు. దీనికి బెస్ట్ చిల్ర్డన్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డు వచ్చింది.
ఆ తర్వాత ‘బెల్ బాటమ్’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, రాజ్ బి శెట్టితో కలిసి ‘గరుడ గమన వృషభ వాహన’ చిత్రంలో నటించాడు. ఆ తర్వాత తీసిన ‘కాంతార’ సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు రిషబ్ శెట్టి. ప్రముఖ హాలీవుడ్ విఎఫ్‌ఎక్స్ కంపెనీ ఈ సినిమాకు వర్క్ చేస్తోంది.