ఇంటిని నిర్మించుకున్న.. కట్టిన ఇల్లు కొన్నా కచ్చితంగా వాస్తు నియమాలు పాటించాలి. వంటగది ఏ దిక్కులో ఉంది.. ఒక గది లేదా రెండు గదుల ఇల్లైనా.. ఎంత పెద్ద ఇల్లైనా.. చిన్న ఇల్లైనా వంట చేసేందుకు ఫేసింగ్ ఎలా ఉంది.. ఇంటి స్థలంలో ఏ మూల ఎంత ఎక్కువ ఉంది.. ఏ కార్నర్ లో ఎక్కువ ఉంది.. మొదలగు విషయాల విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్న సలహాలను ఒకసారి పరిశీలిద్దాం. .
ప్రశ్న: ఇటీవలే మేము వంద గజాల్లో రెండు రూములున్న కట్టిన ఇంటిని కొనుక్కున్నాం. అయితే ఈ కొత్త ఇంట్లో దక్షిణం వైపు వంట చేయాల్సి వస్తోంది. కానీ తెలిసిన వాళ్లందరూ ఆ దిక్కును చూస్తూ వంట చేయొద్దు అని చె బుతున్నారు. అది నిజమేనా? మరి ఏ దిక్కును చూస్తూ వంట చేస్తే మంచిది? మరి మాకు పరిష్కార మార్గమేంటో చెప్పగలరు?
జవాబు : వాస్తు శాస్త్రం పంచభూతాలకు అత్యంత ప్రాధా న్యత ఉంటుంది. అందులో భాగంగానే నిప్పుకు అధిపతి అగ్నిదేవుడు. కాబట్టి వంటగది సూర్యుడు ఉదయించే దిక్కు అంటే తూర్పువైపునకు ఉండాలి. అదీ ఆగ్నేయ మూలై ఉండాలి. వంట చేసే వాళ్లు తూర్పువైపు వంట చేయాలి. సూర్యరశ్మి వంటగది నుంచి ఇంట్లోకి వ్యాపించడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయి. అలా కుదరకపోతే వాయువ్యంలో కట్టి పడమర దిక్కును చూడొచ్చు. ఈ రెండూ కాకుండా ఏ విధంగా చేసినా అనారోగ్యం. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. అవి విడాకుల దాకా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెంటనే వంటగదిని మార్చుకోవడం మంచిది.
ప్రశ్న: మేము స్థలం కొనాలనుకుంటున్నాం. ఇటీవల ఒక దగ్గర అరవై గజాల స్థలాన్ని చూశాం. కానీ అది దీర్ఘచతురస్రాకా రంలోనే ఉన్నా... ఈశాన్య మూల మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉంది. కొందరేమో మంచిదేనని తీసుకోమంటున్నారు. మరికొందరేమో మూల పెరిగిన స్థలం కొంటే మంచిది కాదు అంటున్నారు. మాకేం చేయాలో అర్ధం కావట్లేదు. స్థలానికి ఖర్చయ్యే డబ్బు కూడా మా బడ్జెట్ కు సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పగలరు.
జవాబు : మీరు ఆ స్థలాన్ని సంతోషంగా కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే మూల పెరగడం మంచిది కాదనేది నిజమే. కానీ అది ఈశాన్యం మూల కాబట్టి ఫర్వాలేదు. ఒక్క ఈ మూల తప్ప మరెక్కడ పెరిగినా మంచిది కాదు. ముఖ్యంగా ఆగ్నేయంలో పెరిగితే ఇంట్లో ఆడవాళ్లకు మంచిది కాదు. ఆపరేషన్లు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే 'ఎప్పుడో కొన్నాం, ఇల్లు కట్టుకున్నాం కదా. పరిష్కారం ఏంట'ని అడుగుతారు చాలామంది. ఈశాన్యం కాకుండా వేరే మూల పెరిగితే... ఆ స్థలంలో మట్టి వేసి ఏదైనా మొక్క పెట్టేసి వదిలేయాలి. ఆ మూలని ఏ విధంగా వాడొద్దు. వీలైనంత వరకు మూలలు పెరిగిన (ఈశాన్యం మినహా) స్థలాల్లో ఇల్లు కట్టుకోవ ద్దు. కేవలం చతురస్రం, దీర్ఘచతురస్రాకారంలోనే కట్టాలి. ఇటీవల చాలామంది వృత్తాకారంలోనూ కట్టడాలు చేస్తున్నారు. దానివల్ల నష్టాలు తప్ప లాభాలుండవని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ అంటున్నారు.
