
సినిమా ఫ్యాన్స్ ఎప్పుడెప్పాడా అని ఎదురుచూస్తున్న సైమా అవార్డ్స్ వేడుక త్వరలోనే జరగనుంది. ప్రతి సంవత్సరం గ్రాండ్ గా నిర్వహించే ఈ వేడుకకు సంబంధించి ఈ ఇయర్ నామినేషన్లు రిలీజ్ అయ్యాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలకు సంబంధించి ఏటా నిర్వహించే సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నారు.
వివిధ కేటగిరీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. సినీ రంగానికి విశిష్ఠ సేవలు అందించిన ప్రముఖులను సత్కరిస్తారు. సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులతో ఆగస్టు 15, 16వ తేదీల్లో సైమా అవార్డుల వేడుకలను ఖతార్‌లోని దోహాలో ఘనంగా నిర్వహించనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి వివిధ కేటగిరీలకు సంబంధించిన నామినేషన్లు ఇవే!
ఉత్తమ చిత్రం
భరత్ అనే నేను
గీత గోవిందం
అరవింద సమేత వీర రాఘవ
రంగస్థలం
మహానటి
ఉత్తమ దర్శకుడు
ఇంద్రగంటి మోహన కృష్ణ(సమ్మోహనం)
నాగ్ అశ్విన్(మహానటి)
పరుశురామ్ (గీత గోవిందం)
సుకుమార్ (రంగస్థలం)
త్రివిక్రమ్ (అరవింద సమేత వీర రాఘవ)
ఉత్తమ నటుడు
దుల్కర్ సల్మాన్(మహానటి)
మహేశ్‌బాబు (భరత్ అనే నేను)
ఎన్టీఆర్ (అరవింద సమేత వీర రాఘవ)
రామ్ చరణ్(రంగస్థలం)
సుధీర్‌బాబు (సమ్మోహనం)
విజయ్ దేవరకొండ(గీతగోవిందం)
ఉత్తమ నటి
అదితి రావ్ హైదరీ (సమ్మోహనం)
అనుష్క (భాగమతి)
కీర్తి సురేష్ (మహానటి)
రష్మిక మందాన (గీత గోవిందం)
సమంత (రంగస్థలం)
ఉత్తమ ప్రతినాయకుడు
జగపతిబాబు (రంగస్థలం)
జయరామ్ (భాగమతి)
కునాల్ కపూర్ (దేవదాస్)
మాధవన్ (సవ్యసాచి)
శరత్‌కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
ఉత్తమ సహాయ నటుడు
ఆది పినిశెట్టి (రంగస్థలం)
మురళీశర్మ (విజేత)
రాజేంద్ర ప్రసాద్ (మహానటి)
నరేష్ (సమ్మోహనం)
రాంకీ (ఆర్ ఎక్స్100)
ఉత్తమ సహాయ నటి
అనసూయ (రంగస్థలం)
ఆశా శరత్ (భాగమతి)
జయసుధ (శ్రీనివాస కల్యాణం)
రమ్యకృష్ణ (శైలజారెడ్డి అల్లుడు)
సుప్రియ (గూఢచారి)
ఉత్తమ సంగీత దర్శకుడు
చైతన్ భరద్వాజ్ (ఆర్‌ఎక్స్ 100)
దేవిశ్రీ ప్రసాద్ (రంగస్థలం)
గోపీ సుందర్ (గీత గోవిందం)
మిక్కీ జే మేయర్ (మహానటి)
ఎస్.ఎస్.తమన్ (అరవింద సమేత వీర రాఘవ)
ఉత్తమ హాస్య నటుడు
సత్య (ఛలో)
పృథ్వీ (శైలజారెడ్డి అల్లుడు)
సునీల్ (అమర్ అక్బర్ ఆంటోనీ)
వెన్నెల కిషోర్ (చి.ల.సౌ.)
విష్ణు (ట్యాక్సీవాలా)
ఉత్తమ గీత రచయిత
అనంత్ శ్రీరామ్ (ఇంకే.. ఇంకే కావాలే-గీత గోవిందం)
చంద్రబోస్ (ఎంత సక్కగున్నావే -రంగస్థలం)
కృష్ణకాంత్ (మాటే వినదుగా-ట్యాక్సీ వాలా)
రామజోగయ్య శాస్త్రి (పెనివిటి -అరవింద సమేత)
సిరివెన్నెల సీతారామశాస్త్రి (మూగ మనసులు-మహానటి)
ఉత్తమ గాయకుడు
అనురాగ్ కుల్‌కర్ణి (పిల్లారా.. -ఆర్‌ఎక్స్ 100)
కాల భైరవ (పెనివిటి – అరవింద సమేత)
కైలాష్ ఖేర్ (వచ్చాడయ్యో సామీ – భరత్ అనే నేను)
రాహుల్ శిపిలిగంజ్ (రంగా.. రంగా.. -రంగస్థలం)
సిద్ శ్రీరామ్ (ఇంకే.. ఇంకే కావాలే -గీత గోవిందం)
ఉత్తమ గాయని
చిన్మయి (ఏంటీ.. ఏంటీ – గీత గోవిందం)
మానసి (రంగమ్మ మంగమ్మ -రంగస్థలం)
శ్రేయా ఘోషల్ (అల్లసాని వారి-తొలిప్రేమ)
శ్రేయా గోపరాజు (టిక్ టిక్ టిక్ -సవ్యసాచి)
సునీత ( చివరకు మిగిలేది -మహానటి)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్
డానీ సెలజ్‌లోపేజ్ (మహానటి)
జార్స్ సి విలియమ్స్ (తొలిప్రేమ)
జేకే (పడి పడి లేచె మనసు)
రత్నవేలు (రంగస్థలం)
షానియల్‌దేవ్ (గూఢచారి)