
లండన్ : వరల్డ్ కప్ 2019 మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ లో లోకల్ టీమ్ ఇంగ్లండ్ .. బ్యాటింగ్ లో సత్తా చాటింది. కెన్నింగ్టన్ ఓవల్ లో జరిగిన మొట్టమొదటి లీగ్ మ్యాచ్ లో సౌతాఫ్రికా ముందు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేషించింది.
టాస్ గెలిచి మోర్గాన్ టీమ్ ను బ్యాటింగ్ దించాడు సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కు ఇన్నింగ్స్ రెండో బాల్ కే ఎదురుదెబ్బ తగిలింది. బెయిర్ స్టోను ఔట్ చేసి… ఈ వరల్డ్ కప్ లో తొలి వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సఫారీ బౌలర్ ఇమ్రాన్ తాహిర్. ఐతే.. ఆ తర్వాత ఇంగ్లండ్ వెనుదిరిగి చూడలేదు. తర్వాత వచ్చిన ప్లేయర్స్ అంతా బాగా ఆడారు. 4 హాఫ్ సెంచరీలు కొట్టారు. ఓపెనర్ జేసన్ రాయ్ 54, జో రూట్ 51, ఇయాన్ మోర్గాన్ 57 రన్స్ చేశారు. మధ్యమధ్యలో వికెట్లు పడినా.. స్కోరు వేగం మాత్రం తగ్గకుండా జాగ్రత్త పడ్డారు ఇంగ్లీష్ ప్లేయర్లు.
టాప్ స్కోరర్ బెన్ స్టోక్స్
ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సూపర్బ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. మిడిలార్డర్ , టెయిలెండర్ల సహాయంతో… ఇంగ్లండ్ కు మంచి స్కోరు సాధించి పెట్టాడు. 79 బాల్స్ లో 9 ఫోర్ల సాయంతో 89 రన్స్ చేశాడు స్టోక్స్. ఇన్నింగ్స్ 49వ ఓవర్లో ఔట్ అయ్యాడు స్టోక్స్.
మరోవైపు.. బట్లర్ 18, ఆలి 3, వోక్స్ 13 రన్స్ చేశారు.
మొత్తంగా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 రన్స్ చేసింది ఇంగ్లండ్. సౌతాఫ్రికాకు 312 రన్స్ టార్గెట్ పెట్టింది.
సఫారీ బౌలర్లలో.. ఎంగిడి 3, తాహిర్ 2, రబాడా 2, ఫెలుక్వాయో 1 వికెట్ పడగొట్టారు.