నేడు కేరళకు ‘నైరుతి’ నాలుగైదు రోజుల్లో మన రాష్ట్రానికి

నేడు కేరళకు ‘నైరుతి’ నాలుగైదు రోజుల్లో మన రాష్ట్రానికి

హైదరాబాద్‌, వెలుగు :  నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకే అవకాశముంది. మన రాష్ట్రానికి నాలుగైదు రోజుల్లో చేరుకుంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు, ఏపీ మీదుగా రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. శనివారం కూడా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.  మరో నాలుగు రోజులపాటు వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్‌లో శుక్రవారం అత్యధికంగా 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 43.1, రామగుండంలో 42.4, మెదక్‌లో 42.2, నల్గొండలో 42, భద్రాచలంలో 41.6, హన్మకొండ, ఖమ్మంలలో 41, మహబూబ్‌నగర్‌లో 38.8 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వైపు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి.