సెప్టెంబర్ 11 నుంచి సావరిన్​ గోల్డ్​బాండ్స్​ ఇష్యూ

సెప్టెంబర్ 11 నుంచి సావరిన్​ గోల్డ్​బాండ్స్​ ఇష్యూ
  • గ్రాము నామినల్​ వ్యాల్యూ ఈసారి రూ. 5,923
  • ఆన్​లైన్​లో కొంటే రూ. 50 డిస్కౌంట్​

ముంబై: రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ఇండియా (ఆర్​బీఐ) మరోసారి సావరిన్​ గోల్డ్​ బాండ్​ (ఎస్​జీబీ) ఇష్యూ తెస్తోంది. ఈ నెల 11 నుంచి 15 దాకా ఎస్​జీబీ సిరీస్​2 అందుబాటులో ఉంటుందని ఆర్​బీఐ తెలిపింది. తాజా ఎస్​జీబీ ఇష్యూ కోసం  సావరిన్ గోల్డ్​ బాండ్​​ నామినల్​ వాల్యూను గ్రాముకి రూ. 5,923 గా నిర్ణయించారు. ఇండియన్​ బులియన్​ అసోసియేషన్​ (ఐబీఏ) ప్రకటించే 999 గోల్డ్​ రేటు ఆధారంగా ఈ ధరను నిర్ణయిస్తున్నారు. సబ్​స్క్రిప్షన్​ పీరియడ్​కి ముందు వారంలో చివరి మూడు రోజుల సింపుల్​ ఏవరేజ్​ రేటును బేస్​ చేసుకుని ఎస్​జీబీ నామినల్​ వ్యాల్యూను లెక్కిస్తున్నారు.  అంటే తాజా ఇష్యూ కోసం సెప్టెంబర్​ 6, 7, 8 తేదీలను లెక్కలోకి తీసుకున్నారు.

డిస్కౌంట్....

ఆన్​లైన్​లో ఇన్వెస్ట్​ చేసే వారికి నామినల్​ వ్యాల్యూతో పోలిస్తే రూ. 50 డిస్కౌంట్​ను సావరిన్​ గోల్డ్​ బాండ్స్​పై ప్రభుత్వం అందిస్తోంది. ఇలాంటి ఆన్​లైన్​ ఇన్వెస్టర్లకు గోల్డ్​ బాండ్​ రూ. 5,873 (గ్రాము) కే దొరుకుతుందన్న మాట. 

ఎస్​జీబీ ఎలా కొనాలి....

ఎనిమిదేళ్ల టెనార్​ ఉండే ఈ సావరిన్​ గోల్డ్​ బాండ్స్​ను బ్యాంకులు, స్టాక్​హోల్డింగ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (షిల్​) , పోస్టాఫీసులు, ఎన్​ఎస్​ఈ, బీఎస్​ఈల నుంచి కొనవచ్చు. అయిదేళ్ల తర్వాత ఒకసారి ఎగ్జిట్​ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎస్​బీఐ నెట్​బ్యాంకింగ్​ ద్వారా సావరిన్​ గోల్డ్​ బాండ్స్​ను కొనుగోలు చేసుకునే వీలుంది. ఎన్​ఎస్​డీఎల్​ లేదా సీడీఎస్​ఎల్​లోని డీమ్యాట్​ అకౌంట్ వివరాలను ఇవ్వడం కోసం వన్​టైమ్​ రిజిస్ట్రేషన్​ను ఇన్వెస్టర్లు చేసుకోవల్సి ఉంటుంది.

వడ్డీ 2.50 శాతం....

సావరిన్​ గోల్డ్ బాండ్స్​ నామినల్​ వ్యాల్యూపై ఇన్వెస్టర్లు ఏటా 2.50 శాతం చొప్పున ఫిక్స్​డ్​ రేటు వడ్డీ చెల్లిస్తారు. ఆల్టర్నేటివ్​ ఇయర్స్​లో ఈ వడ్డీ చెల్లింపు ఉంటుంది. సింగిల్​ అకౌంట్​ హోల్డర్లకు మాత్రమే  ఆన్​లైన్​లో ఎస్​జీబీలు కొనే అవకాశం కల్పిస్తున్నారు. జాయింట్​ ఇన్వెస్ట్​మెంట్లకు అనుమతి లేదు. సావరిన్​గోల్డ్​ బాండ్స్​లో పెట్టుబడికి ఒక హోల్డింగ్​ సర్టిఫికెట్​ను జారీ చేస్తారు. ఈ బాండ్స్​ను డీమ్యాట్​లోకి కన్వర్షన్​ చేసుకునే వీలుంది.