ఆదివాసి మహిళలను జైలుకు తరలించడం దుర్మార్గం

ఆదివాసి మహిళలను జైలుకు తరలించడం దుర్మార్గం

గిరిజనులను వేధిస్తున్న అటవీ అధికారుల జాబితాను రూపొందించి...  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి భరతం పడుతామని బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. పోడు భూముల కేసులో అరెస్టు అయిన ఆదివాసి మహిళల కుటుంబాలను పరామర్శించిన ఆయన... వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పోడు భూముల వ్యవహారంలో ఆదివాసి మహిళలను జైలుకు తరలించడం దుర్మార్గమని, పోడు భూముల సమస్యను పరిష్కరించకపోతే ఆదివాసులతో కలసి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి సమస్యను పరిష్కరించి అర్హులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు.