డయల్100కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి వెళ్లాలి : ఎస్పీ బి.రోహిత్ రాజు

డయల్100కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి వెళ్లాలి : ఎస్పీ బి.రోహిత్ రాజు
  • ఎస్పీ బి.రోహిత్​ రాజు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  డయల్​ 100కు ఫోన్​ రాగానే పోలీస్​లు ఘటనా స్థలానికి వెళ్లి బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ బి.రోహిత్​రాజు సూచించారు. లక్ష్మీ దేవిపల్లి పోలీస్​స్టేషన్​ను ఆయన శుక్రవారం సందర్శించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.

 పోలీస్​ స్టేషన్​ను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పోలీస్​ స్టేషన్​కు వచ్చే బాధితులకు న్యాయం చేసేలా పోలీస్​లు వ్యవహరించాలని చెప్పారు. సైబర్​ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, చంద్రశేఖర్​ ఉన్నారు.