రవీంద్ర భారతిలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ

రవీంద్ర భారతిలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ

హైదరాబాద్: రవీంద్ర భారతిలో ప్రముఖ నేపథ్య గాయకులు, దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఎస్పీ బాలు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. రవీంద్ర భారతిలో తన విగ్రహం పెట్టాలన్నది బాలు చివరి కోరిక అని ఆయన సోదరి SP శైలజ చెప్పారు. ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు బాలుకు నివాళిగా సినీ సంగీత స్వర నీరాజనం ఉంటుంది.

ప్రముఖ సినీ సంగీత దర్శకులు కీరవాణి, తమన్, సినీ నేపథ్య గాయకులు, బాలు కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొంటారు. బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో పాటు హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు అతిథులుగా హాజరు కావడం గమనార్హం. బాల సుబ్రమణ్యం కుటుంబం నుంచి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్, బాలు సోదరి ఎస్పీ శైలజ, నటుడు శుభలేఖ సుధాకర్ హాజరయ్యారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం:
* ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను పూర్తి పేరుతో పిలవండి
* పరిపూర్ణ కళాకారుడు బాల సుబ్రహ్మణ్యం
* నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా నిలిచిన మహనీయుడు
* రవీంద్ర భారతిలో విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ఆనందం
* తెలుగు సినిమా రంగంలో బాల సుబ్రహ్మణ్యం పాత్ర గురించి మాటల్లో చెప్పలేం
* రోజూ నేను ఉదయాన్నే లేచాక బాల సుబ్రహ్మణ్యం, ఘంటసాల పాటలు వింటాను
* నవ తరానికి, యువ తరానికి, రేపటి తరానికి ఈ మహానుభావుడు గురించి తెలిసేలా విగ్రహం ఏర్పాటు చేశాం
* విగ్రహానికి రూపం పోసిన శిల్పికి ధన్యవాదాలు
* బాల సుబ్రహ్మణ్యం ప్రతి పాట, ప్రతి రాగం ఒక భావ జలపాతం

మంత్రి శ్రీధర్ బాబు:
* ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చెప్పుకోదగ్గ విషయం
* తెలుగుతో పాటు 14 భాషలలో పాటలు పాడి పాటల పల్లకిలో ఉంటూ మన గుండెల్లో నిలిచాడు
* ఒక నటుడిగా, సంగీత దర్శకుడిగా పరిచయం.. 40 వేల పై చిలుకు పాటలు పాడాడు
* బాల సుబ్రహ్మణ్యం అభిమానులు చాలా మంది మహనీయుడి విగ్రహం పెట్టాలన్నారు
* ప్రపంచ స్థాయిలో నిలిచే వ్యక్తి బాల సుబ్రహ్మణ్యం
* రవీంద్ర భారతి అంటే కళలను ప్రోత్సహించిన ప్రదేశం
* మా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, జూపల్లి కృష్ణారావు రావాల్సి ఉండే.. కొన్ని కారణాల వల్ల రాలేదు
* కోట్లాది మంది హృదయ స్పందన ఇది... సినిమాలో తెర వెనుక పాడే వారు ఎవరని తెలియదు
* మహనీయుడు బాల సుబ్రహ్మణ్యం.. పాటలతోనే సినిమాలు హిట్ అవుతుంటాయి
* పది సంవత్సరాల కింద నేను మంత్రిగా ఉన్నపుడు బాల సుబ్రహ్మణ్యంను కలిశాను
*రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు