నిజాంపేట, వెలుగు:పోలీస్ సిబ్బంది అంకితభావంతో పని చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా గురువారం నిజాంపేట పీఎస్‌ను సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, సిబ్బంది బ్యారెక్స్,స్టేషన్ రికార్డుల ను తనిఖీ చేశారు. ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగాలని స్టేషన్ కు వచ్చిన ప్రతి కంప్లైంట్ ఆన్లైన్లో నమోదు చేయాలని ఎస్ హెచ్ ఓకు సూచించారు.
ప్రతి రోజు వాహనాల తనిఖీ చేస్తూ అనుమానాస్పద వాహనాలను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. బ్లూ కోల్ట్ సిబ్బంది ప్రతి పాయింట్ ను తనిఖీ చేయాలని డయల్ 100 కాల్స్ కు వేగంగా స్పందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్బీ ఇన్ స్పెక్టర్ సందీప్ రెడ్డి ఉన్నారు.
దేవీసింగ్ అందరికీ ఆదర్శం
మెదక్ టౌన్: వరదల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడిన దేవీసింగ్ అందరికీ ఆదర్శమని ఎస్పీ శ్రీనివాస్ రావు అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల సమయంలో హవేలీ ఘనపూర్ మండలం రాజ్‌పేట బ్రిడ్జి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో అక్కడ చిక్కుకున్న పది మందిని దేవీసింగ్కాపాడారన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో దేవీసింగ్ను ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
