నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు
  •     ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు

మెదక్​టౌన్, వెలుగు: పోలీసులు అన్ని కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్​రావు సూచించారు. మంగళవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అండర్ ఇన్వెస్టిగేషన్‌‌లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్, మిస్సింగ్ కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అత్యాచార, పోక్సో కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. పెండింగ్ కేసుల చేధనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించి క్లియర్​చేయాలన్నారు. ఆన్‌‌లైన్ బెట్టింగ్ యాప్స్, మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌‌ను మరింత పెంచాలని సూచించారు. 

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్​ కార్యక్రమం ప్రతీ గ్రామంలో నిర్వహించాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్​ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, సీఐలు జానారెడ్డి, రేణుక రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రంగా కృష్ణ, సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, జిల్లా ఎస్‌‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.