పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

లక్ష్మణచాంద(మామడ), వెలుగు :  మామడ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఎస్పీ జానకి షర్మిల తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలతో పాటు సిబ్బంది విధులు, అధికారుల పనితీరును పరిశీలించారు. స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలతో పాటు వాటి స్థితిగతులపై ఆరా తీశారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని సూచించారు.