కోడ్ ముగిసే దాకా విజయోత్సవ ర్యాలీలు నిషేధం : ఎస్పీ మహేశ్‌‌‌‌‌‌‌‌

కోడ్ ముగిసే దాకా విజయోత్సవ ర్యాలీలు నిషేధం : ఎస్పీ మహేశ్‌‌‌‌‌‌‌‌
  • ఎస్పీ మహేశ్‌‌‌‌‌‌‌‌ బి.గీతే

వేములవాడ, వెలుగు: అన్ని విడతల గ్రామపంచాయతీ ఎన్నికలు అయిపోయేదాకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని, ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు నిర్వహించడం నిషేధమని రాజన్నసిరిసిల్ల ఎస్పీ మహేశ్‌‌‌‌‌‌‌‌ బి.గీతే​ అన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌ను పాటించాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

జగిత్యాల టౌన్, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, మూడో విడత పోలింగ్ అయిపోయేదాక కోడ్​అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా గుంపులు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. విజయోత్సవ ర్యాలీలు, పటాకులు కాల్చడం, డీజేలతో ఊరేగింపులు పూర్తిగా  నిషేధమన్నారు.