
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తును చేపట్టి, బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ పరితోశ్పంకజ్సూచించారు. మంగళవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా దోషులను న్యాయస్థానం ముందు ఉంచాలన్నారు. నేరం జరిగిన వెంటనే నేర స్థలానికి చేరుకొని ఉన్న సాక్ష్యాదారాలుచెరిగిపోకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించాలన్నారు.
బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ రవాణా, ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురైతే గంటలోపుగా 1930 ఫిర్యాదు చేయవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిరోజు డ్రంకన్డ్రైవ్టెస్టులు చేయాలన్నారు. అనంతరం ఎస్ హెచ్ ఓ వాహనాలను తనిఖీ చేస్తూ వెహికల్స్ను కండిషన్లో ఉండే విధంగా చూసుకోవాలని డ్రైవర్లకు సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు సత్తయ్య గౌడ్, ప్రభాకర్, సైదా నాయక్, వెంకటరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సీఐలు రమేశ్, కిరణ్, ప్రవీణ్ రెడ్డి, రవి పాల్గొన్నారు.