
కామారెడ్డి, వెలుగు : నేరాల నియంత్రణకు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. సోమవారం బీబీపేట పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. సిబ్బంది రోల్ కాల్‌ను పరిశీలించారు. స్టేషన్ రికార్డులు, వివిధ కేసులకు సంబంధించిన ఫైల్స్ పరిశీలించి మాట్లాడారు.
.కేసుల దర్యాప్తులో కానిస్టేబుల్స్ పాత్ర కీలకమన్నారు. గస్తీ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. ఆయా చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలన్నారు. కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్యారెడ్డి, ఎస్సై ప్రభాకర్ తదితరులు ఉన్నారు.