వన దేవతలను దర్శించుకున్న ఎస్పీ

వన దేవతలను దర్శించుకున్న ఎస్పీ

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మలను సోమవారం ఎస్పీ సుధీర్ రామ్​నాథ్ కేకన్, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్ దర్శించుకున్నారు. ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి మేడారం వచ్చిన ఆయనను ఎండోమెంట్ అధికారులు, పూజారులు సన్మానించారు. డోలు వాయిద్యాలతో అమ్మవారి గద్దెల వరకు తీసుకువెళ్లి, గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు.

 అనంతరం వారు మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను మ్యాప్​ద్వారా తెలు సుకుని, బైక్​పై తిరుగుతూ పరిశీలించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు మధు, జగదీశ్, పస్ర సీఐ దయాకర్, స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తదితరులున్నారు.