నారాయణపేట, వెలుగు: చెక్ పోస్ట్ వద్ద అలర్ట్‌గా ఉండాలని నారాయణపేట ఎస్పీ వినీత్ సూచించారు. సోమవారం నారాయణపేట మండలం జలాల్పూర్ సరిహద్దు చెక్‌పోస్ట్ ను తనిఖీ చేశారు. ప్రతి వెహికల్‌ను తనిఖీ చేయాలని, వాహనాల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైతే వీడియో రికార్డింగ్‌తో తనిఖీలు చేయాలన్నారు. అక్రమంగా వడ్లు రాకుండా, పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలని సూచించారు.
నిత్యావసర సరుకులు అందజేత
ఇటీవల లొంగిపోయిన మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన మావోయిస్టు దంపతులు అనిల్ కుమార్, భవాని అలియాస్ సుగుణ సోమవారం ఎస్పీ వినీత్ ను కలిశారు. వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, వంట పాత్రలు అందజేశారు. వారి పునరావాసానికి పోలీస్ శాఖ తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఏఎస్పీ ఎండీ రియాజ్ ఉల్ హక్, ఎస్బీ ఎస్సై నరేశ్ పాల్గొన్నారు.
