నాసా స్పేస్​ఎక్స్ మిషన్ ప్రయోగం వాయిదా

నాసా స్పేస్​ఎక్స్ మిషన్ ప్రయోగం వాయిదా

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన చరిత్రాత్మక స్పేస్ ఎక్స్ క్య్రూ డ్రాగన్ మిషన్ ప్రయోగం లాస్ట్ మినెట్​లో ఆగిపోయింది. స్పేస్ ఎక్స్ ప్రైవేటు సంస్థ రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం అమెరికా ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ నుంచి బుధవారం సాయంత్రం 4.33 గంటలకు ప్రయోగించాల్సింది. కానీ, ఆ స్పేస్ ఫ్లైట్ ఎగరడానికి 17 నిమిషాల ముందు కౌంట్​డౌన్ నిలిపివేశారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ప్రయోగం నిలిపివేశామని, పరిస్థితులను బట్టి మే 30న మళ్లీ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ను ఎగరవేస్తామని సంస్థ ప్రకటించింది. ఆస్ట్రోనాట్స్ బాబ్ బెహెన్కెన్, డగ్ హార్లే ఇద్దరూ ఆ రాకెట్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) కు వెళ్లవలసి ఉంది. వీళ్లిద్దరూ డ్రాగన్ క్యాప్సూల్ లోకి ప్రవేశించిన తర్వాత టేకాఫ్​ నిలిపివేయాలని నిర్ణయించినట్లు లాంచ్ డైరెక్టర్ మైక్ టేలర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే, ఈ ప్రయోగం చూసేందుకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ఫ్టోరిడా స్పేస్ స్టేషన్ కు చేరుకున్నారు. కానీ, ప్రయోగం వాయిదా పడటంతో వైట్ హౌస్​కు వెనుతిరిగారు.

అంతరిక్ష ప్రయోగాల్లోకి తొలిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ అడుగుపెట్టింది. టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌కు చెందిన ప్రైవేటు స్పేస్ ఏజెన్సీ ‘స్పేస్‌ఎక్స్‌’ సంస్థ ‘నాసా అండ్‌ స్పేస్‌ఎక్స్‌ క్రూడ్‌ స్పేస్‌ లాంచ్‌’ ప్రయోగాన్ని చేపడుతోంది. అంతరిక్షంలోకి సామాన్య ప్రజలను ఈ వాహనంలో తీసుకువెళ్ళాలని స్పేస్ ఎక్స్ భావిస్తోంది. అందులో భాగంగా ఆస్ట్రోనాట్స్ ను స్పేస్ లోకి పంపి పరీక్షించాలనుకుంది. ఈ మిషన్ సక్సెస్ అయితే ఐఎస్ఎస్ కు వెళ్లడానికి సూయజ్ లాంటి రాకెట్స్ కోసం రష్యాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని అమెరికా భావిస్తోంది.