తొలిసారి ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన స్పెయిన్

తొలిసారి ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన స్పెయిన్
  •     ఫిఫా విమెన్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ కైవసం

సిడ్నీ: టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించిన స్పెయిన్‌‌‌‌‌‌‌‌ తొలిసారి ఫిఫా విమెన్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్‌‌‌‌‌‌‌‌ 1–0తో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. స్పెయిన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఓల్గా కార్మోనా (29వ ని.) ఏకైక గోల్‌‌‌‌‌‌‌‌ చేసింది. 2007లో జర్మనీ తర్వాత మహిళల వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన తొలి యూరోపియన్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌గా స్పెయిన్‌‌‌‌‌‌‌‌ చరిత్ర సృష్టించింది. 29వ నిమిషంలో కార్మోనా కొట్టిన లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ కిక్‌‌‌‌‌‌‌‌ను ఆపడంలో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ మేరీ ఇయర్ప్స్‌‌‌‌‌‌‌‌ విఫలమైంది.

ఇక అక్కడి నుంచి గోల్స్‌‌‌‌‌‌‌‌ కోసం ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ చేసిన ప్రయత్నాలను స్పెయిన్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ తిప్పికొట్టింది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ద్వారా కార్మోనా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కార్లీ లాయిడ్‌‌‌‌‌‌‌‌ (2015) తర్వాత సెమీస్‌‌‌‌‌‌‌‌, ఫైనల్లో గోల్స్‌‌‌‌‌‌‌‌ కొట్టిన తొలి ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కింది. ఫైనల్​ తర్వాత స్పెయిన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ల సంబురాలు అంబరాన్ని అంటాయి.  టెన్నిస్‌‌‌‌‌‌‌‌ గ్రేట్‌‌‌‌‌‌‌‌ బిల్లీ జీన్‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు 75, 784 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.