న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లలో నంబర్లను బ్లాక్చేయడం ద్వారా స్పామ్ కాల్స్ ఆగవని, వాటి గురించి తమ డు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) యాప్ ద్వారా తెలియజేయాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సోమవారం తెలిపింది.
ఈ యాప్లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా 21 లక్షలకు పైగా మొబైల్ నంబర్లను బ్లాక్ చేశామని వెల్లడించింది. ఫోన్లో నంబరును బ్లాక్ చేస్తే మోసగాడు మరో నంబరుతో ఫోన్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
