ప్రజాస్వామ్యం కోసం ఎలుగెత్తండి: రాహుల్ గాంధీ

ప్రజాస్వామ్యం కోసం ఎలుగెత్తండి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఇండో–చైనా బార్డర్ వివాదం, ఎకానమీ, కరోనా క్రైసిస్‌పై కేంద్ర ప్రభుత్వం, మోడీని టార్గెట్‌గా చేసుకొని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆయన రాజస్థాన్ సంక్షోభంపై స్పందించారు. బీజేపీ మీద ఆయన మండిపడ్డారు. స్పీకప్ ఫర్ డెమోక్రసీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌‌లో రాహుల్ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ప్రజాస్వామ్యానికి మద్దుతగా కలసి గొంతుకను వినిపించండి అంటూ ప్రజలను రాహుల్ కోరారు. రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సోమవారం దేశవ్యాప్తంగా నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

‘మొత్తం దేశం కరోనాతో పోరాడుతున్న సమయంలో బీజేపీ రాజ్యాంగాన్ని కత్తిరించడమే గాక ప్రజాస్వామ్యాన్ని కూలగొడుతోంది. రాజస్థాన్‌లో వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నదే మా డిమాండ్. ఇది రాజ్యాంగం ప్రకారం మా హక్కు’ అని రాహుల్ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం, దేశ ప్రజల గొంతుక మేరకు ఇండియా ముందుకెళ్తుందని పేర్కొన్నారు. బీజేపీ కుట్ర నుంచి రాజ్యాంగాన్ని ప్రజలే రక్షిస్తారన్నారు.