యూపీఏ అటవీ చట్టంతోనే గిరిజనులకు లబ్ధి : స్పీకర్ గడ్డం ప్రసాద్​ కుమార్

యూపీఏ అటవీ చట్టంతోనే గిరిజనులకు లబ్ధి :  స్పీకర్ గడ్డం ప్రసాద్​ కుమార్

వికారాబాద్, వెలుగు: యుపీఏ  ప్రభుత్వం 2005లో తీసుకొచ్చిన అటవీ చట్టం వల్ల గిరిజనులు ఎంతగానో లబ్ధి పొందారని, లక్షలాది మందికి భూములపై పట్టాలు వచ్చాయని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​ కుమార్ తెలిపారు. వికారాబాద్‌‌లో జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కోరారు. రిజర్వేషన్లు, భూ సంస్కరణల ద్వారా గిరిజనులకు హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్​ దేనని చెప్పారు. 

ఈ ఏడాది బడ్జెట్‌‌లో గిరిజనుల కోసం 17,167 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాండాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈ  కార్యక్రమంలో  ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు విక్రాంత్ బురియా, ఆదివాసి కాంగ్రెస్ కన్వీనర్ రాహుల్ బల్ జి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్​కిషన్ నాయక్, వికారాబాద్ పట్టణ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు చిగుర్లపల్లి రమేష్​కుమార్​, ముక్తార్​ షరీఫ్​ తదితరులు పాల్గొన్నారు.