పత్రికల నిర్వహణ సులువేం కాదు : గడ్డం ప్రసాద్ కుమార్

పత్రికల నిర్వహణ సులువేం కాదు : గడ్డం ప్రసాద్ కుమార్

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత పరిస్థితుల్లో పత్రికల నిర్వహణ అంత సులువు కాదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. పత్రికలు సమాజ చైతన్యానికి తోడ్పడాలని కోరారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ‘అతిథి’ మాస పత్రిక దశాబ్ది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై మాట్లాడారు. 

నేటి తరం పత్రికల్లో అతిథి పత్రిక ఎంతో విలువలతో కొనసాగుతున్నదని చెప్పారు. ఆపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు పనిచేయాలని కోరారు. పదేండ్ల అతిథి మాసపత్రికలను చదివితే ఉన్నత విద్యలో వచ్చిన మార్పులు తెలుస్తాయని తెలిపారు. 

కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ మిశ్రా, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ మహమూద్, సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్,  జేఎన్టీయూ మాజీ వీసీ  డీఎన్ రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ సెక్రటరీ బాలాచారి, అతిథి మాస పత్రిక ఎడిటర్  వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.