
హనుమకొండ సిటీ, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హనుమకొండ నుంచి స్పెషల్ బస్సులు స్టార్ట్ అయ్యాయి. బాల సముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బస్సులను శనివారం ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు హయగ్రీవాచారి గ్రౌండ్ నుంచి మేడారం వరకు 24 గంటలూ బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.110గా నిర్ణయించామన్నారు. భక్తుల కోరిక మేరకు ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులు కూడా నడిపిస్తామని డిపో మేనేజర్ కేశరాజు భానుకిరణ్ తెలిపారు.