ఓటు నమోదుకు స్పెషల్ క్యాంపెయిన్

ఓటు నమోదుకు స్పెషల్ క్యాంపెయిన్
  • ఓటు నమోదుకు స్పెషల్ క్యాంపెయిన్ 
  • ఇయ్యాల, రేపు ఫ్రీగా దరఖాస్తు చేసుకునేందుకు చాన్స్
  • ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక క్యాంప్
  • ఓటర్ కార్డుల మార్పులు, చేర్పులకూ అవకాశం
  • అక్టోబర్ 4న విడుదల కానున్న ఓటర్ జాబితా

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల గుర్తింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండినోళ్లకు ఓటు హక్కు కల్పించేలా శని, ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఓటరు కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా అవకాశం ఇస్తున్నారు. ఈ రెండ్రోజులపాటు ఫ్రీగా అప్లికేషన్ ఫామ్ తీసుకోనున్నారు. ఆపై సెప్టెంబర్ 19 దాకా మీ సేవా ద్వారా ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ప్రతీ గ్రామంలో అందుబాటులో అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ప్రతి పోలిం గ్ కేంద్రంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తారు. ప్రతీ గ్రామంలో బీఎల్​వో శని, ఆదివారాలు అం దుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీరిదగ్గర ఓటర్​ లిస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. లిస్ట్​లో ఉన్న పేర్లు కూడా పరిశీలించవచ్చు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

19 దాకా మీసేవాలో దరఖాస్తులు 

సెప్టెంబర్ 19 దాకా మీసేవాలో ఫీజు కట్టి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. 19 నాటికి వచ్చిన అన్ని అప్లికేషన్లను పరిశీలించి అక్టోబర్ 4న తుది ఓటర్ జాబితాను విడుదల చేయనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండినవాళ్లుకూడా సెప్టెంబర్ 2, 3 తేదీల్లో అప్లై చేసుకోవచ్చని అంటున్నారు.
 
ఆన్​లైన్​లోనూ అప్లికేషన్​కు చాన్స్

ఆన్​లైన్​లోనూ అప్లికేషన్​కు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. voters.eci.gov.in, voter helpline mobile  యాప్ ద్వారా ఆన్​లైన్​లోనే ఫామ్–6 నింపి ఓటరుగా, కొత్త ఓటరుగా, ఫామ్​–8 నింపి ఓటరు జాబితాలో సవరణ చేసుకునే అవకాశం కల్పించారు. వివరాలకు 1950 టోల్​ఫ్రీ నంబర్​కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలలోగా వరకు ఫోన్ చేయొచ్చు. అక్టోబర్ ​1 నాటికి 18 ఏండ్లు నిండేవాళ్లూ అప్లై చేసుకోవచ్చు.