
- ఓటరు జాబితా, నమోదుపై .. స్పెషల్ క్యాంపెయిన్ రోస్
- ఇయ్యాల, రేపు, సెప్టెంబర్ 2,3 తేదీల్లో నిర్వహణ
- హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్
సికింద్రాబాద్, వెలుగు: ఓటరు జాబితా తయారీలో భాగంగా ఇయ్యాల, రేపు, సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా 18 ఏళ్లు నిండినవారు, ఇప్పటి జాబితాలో పేరు నమోదు కానివారు, 1 అక్టోబర్ 2023 నాటికి 18 ఏండ్లు నిండబోయే వారు కూడా ఓటరు నమోదుకు అర్హులని పేర్కొన్నారు.
ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా పోలింగ్ బూత్ బీఎల్వో వద్ద ఉంటుందని, మీ పేరు ఉందో, లేదో, ఏమైనా తప్పులున్నా వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. కొత్త ఓటరు నమోదు, ఫారం-–6 ద్వారా, మార్పులు, చేర్పులకు ఫారం–-8 ద్వారా ఆఫ్ లైన్ అయితే సమీపంలోని పోలింగ్ బూత్ వద్ద బూత్ లెవెల్ ప్రత్యేక క్యాంపెయిన్ తేదీల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఆన్లైన్లో https://voters.eci.gov.in లేదా voter helpline మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కూడా సవరణలు చేసుకోవచ్చన్నారు. తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్వో అవసరమైన ఫారాలు సిద్ధంగా ఉంచుకోవాలని, బూత్ స్థాయి అధికారి హాజరు కాకుంటే క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని నియోజకవర్గం ఈఆర్వోలను ఆదేశించారు. పూర్తి వివరాలు, ఇతర సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కి కాల్ చేసి ఉదయం10.30 నుంచి సాయంత్రం 5 గంటలకు సంప్రదించవచ్చనిఆయన కోరారు.